Agent Anand Santosh Trailer: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' ట్రైలర్ - అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తుందెవరో ఈ 'ఏజెంట్' కనిపెట్టగలడా?

'ఏజెంట్ ఆనంద్ సంతోష్'(AAS) సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

Continues below advertisement
యూట్యూబర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నారు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో అతడి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో వలన అతడిపై కొంత నెగెటివిటీ వచ్చినప్పటికీ.. కెరీర్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఇప్పటికే యూట్యూబ్ లో పలు సిరీస్ లు చేసిన షణ్ముఖ్ కొన్ని రోజుల క్రితం 'ఆహా' ఓటీటీ సంస్థ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

అదే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'(AAS). తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. నేటి జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ కట్ చేశారు. ఈ సిరీస్ లో షణ్ముఖ్ డిటెక్టివ్ గా నటిస్తున్నాడు. 'మనిషి బ్రతకడానికి జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు.. ఆ రూల్సే బ్రేక్ చేస్తే..?' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.  
 
చిన్న చిన్న డిటెక్టివ్ పనులు చేసుకునే హీరో.. కూకట్ పల్లిలో వరుసగా కిడ్నాప్ అవుతోన్న అమ్మాయిల కేసుని చేధించాలని ఫిక్స్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే కథ అని తెలుస్తోంది. అయితే సీరియస్ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా షణ్ముఖ్ కామెడీ యాంగిల్ లో చిత్రీకరించినట్లు ఉన్నారు. జూలై 22 నుంచి ఈ సిరీస్ ను ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. 
 

Continues below advertisement
Sponsored Links by Taboola