బాలీవుడ్ హీరో హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి బాట పడుతున్నారు. కత్రినా - విక్కీ కౌశల్ గురువారం మనువాడుతుండగా, కొన్ని రోజుల క్రితం రాజ్ కుమార్ రావ్ తన ప్రేయసి పత్రలేఖను పెళ్లాడారు. త్వరలో అలియా - రణ్ బీర్ కపూర్ పెళ్లి కూడా జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబందించి ఆ ఇద్దరి ఫోటో షూట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. కాగా ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడిని పెళ్లాడేందుకు సిద్దమవుతోందట. సాహోలో ప్రభాస్ పక్కన మెరిసిన శ్రద్దా కపూర్ వివాహం చేసుకునేందుకు సుముఖతగా ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురిగా స్టార్‌డమ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. చాలా తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. 


ఎవరా ప్రియుడు?
శ్రద్ధా కపూర్ చాలా కాలంగా రోహన్ శ్రేష్ట అనే ఫోటో గ్రాఫర్ ను ప్రేమిస్తోందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ఇంట్లో పెద్దలకు కూడా ఈ విషయం తెలుసని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చాలా సెలెబ్రిటీ కార్యక్రమాలకు వీరిద్దరూ జంటగా హాజరయ్యారు కూడా. హఠాత్తుగా ఈమె పెళ్లి వార్తలు రావడానికి కారణం ఇన్ స్టాలో ఆమె పెట్టిన పోస్టే. శ్రద్ధా మేనత్త పద్హిని కొల్హాపురి గాయని. ఆమె గతంలో తాను పాడిన పాటనే తిరిగి రీక్రియేట్ చేసింది. ఆ పాటను శ్రద్ధా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దానికి పద్మిని ‘నీ పెళ్లిలో కూడా ఇదే పాట పాడుతాను’ అని కామెంట్ చేసింది. దీంతో శ్రధ్ధా కూడా పెళ్లి చేసుకోబోతోందనే పుకార్లు ప్రారంభమయ్యాయి. 


శ్రద్ధా కపూర్... భాఘి, ఏక్ విలన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ , ఆషికీ-2 వంటి హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. నాగిన్, చాల్ బాజ్ ఇన్ లండన్, లవ్ రంజన్ తీస్తున్న మరో సినిమా... ఇలా సినిమాలతో బిజీగానే ఉంది శ్రద్ధా. 





Also Read: నాగ్ మామ.. కామకలాపాలు చూడలేకపోతున్నాం.. నటి షాకింగ్ కామెంట్స్
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Also Read: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం.. డాక్టర్ బాబు , వంటలక్కకి రుద్రాణి నుంచి కొత్త కష్టాలు..
Also Read: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి