శర్వానంద్(Sharwanand) కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'ఒకే ఒక జీవితం'(Oke Oka Jeevitham). ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సినిమాలో పాటలు కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి.
Oke Oka Jeevitham Trailer: సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా పాల్గొంటున్నారు శర్వానంద్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. హీరో శర్వానంద్.. ఆది అనే క్యారెక్టర్ లో కనిపించారు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఎంతో ఫ్యాషన్ తో ఉండేవాడు. పాల్, శీను అనే మరో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వీరందరూ కలిసి గతంలోకి వెళ్లిపోతారు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. శర్వా పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!

శర్వా సినిమాలో కార్తీ పాట:
ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిన్నపిల్లలంతా కలిసి కోరస్ పాడుతుంటారు. లీడ్ సింగర్ ఎవరని చర్చకి రాగా.. ఓ స్టార్ హీరో అని చెబుతారు. దీంతో వారంతా ఎవరై ఉంటారా..? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి ముందు బకెట్ తో బిరియాని తీసుకొచ్చి పెడతారు. సింబాలిక్ గా హీరో కార్తీ అని చెప్పకనే చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ లో 'ఖైదీ' మ్యూజిక్ కూడా వినిపించింది.
అంటే శర్వానంద్ కోసం కార్తీ పాట పాడడానికి రెడీ అయ్యారన్నమాట. ఇదివరకు కూడా కార్తీ పాటలు పాడారు. తమిళంలో ఆయన నటించిన 'శకుని', 'బిరియాని' సినిమాల్లో సాంగ్స్ పాడారు కార్తీ. ఇప్పుడు వేరే హీరో సినిమాలో పాడబోతున్నారు.
'ఒకే ఒక జీవితం' సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.