మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) రిప్లై ఇచ్చారు. ట్విట్టర్‌లో ఓ స్టార్‌కు మరో స్టార్‌ రిప్లై ఇవ్వడం పెద్ద విశేషం ఏమీ కాదు. అయితే, తెలుగులో షారుఖ్ ట్వీట్ చేయడం విశేషమే కదా! పైగా, 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడం గ్యారెంటీ అన్నట్లు చెప్పడం గొప్పే కదా! అసలు, వివరాల్లోకి వెళితే... 


షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'పఠాన్'. ఈ రోజు ట్రైలర్ (Pathaan Movie Trailer) విడుదల అయ్యింది. 'పఠాన్' తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు షారుఖ్ థాంక్స్ చెప్పారు. అంతే కాదు... 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడం కన్ఫర్మ్ అని కాన్ఫిడెన్స్ చూపించారు. 


నన్ను టచ్ చేయనివ్వండి!
''మీ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి దానిని నన్ను టచ్ చేయనివ్వండి. లవ్ యు'' అని షారుఖ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చూసిన 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'పఠాన్' తమిళ ట్రైలర్‌ను దళపతి విజయ్ ట్వీట్ చేశారు. ఆయనకు తమిళంలో షారుఖ్ రిప్లై ఇచ్చారు. 






యాక్షన్‌తో కుమ్మేసిన 'పఠాన్'
'పఠాన్' ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... జాన్ అబ్రహం ఒక పోలీస్ కార్ మీద రాకెట్ లాంచ్ బాంబు షూట్ చేయడంతో స్టార్ట్ అయ్యింది. ఒక ప్రయివేట్ టెర్రర్ టీమ్ ఇండియా మీద భారీ ఎత్తున ఎటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇంటిలిజెన్స్ గ్రూప్ అజ్ఞాతవాసంలో ఉన్న గూఢచారి 'పఠాన్' (షారుఖ్ ఖాన్)ను రమ్మంటుంది. యాక్షన్.. యాక్షన్.. యాక్షన్... ట్రైలర్ మొత్తం యాక్షన్ ఉంది. హెలికాఫ్టర్ డ్రైవ్ చేస్తూ షారుఖ్ షూట్ చేసే విజువల్స్, ట్రైలర్ ఎండింగ్ హైలైట్ అని చెప్పాలి.


Also Read : 'వారసుడు' వాయిదా వేసినా పవర్ చూపించిన 'దిల్' రాజు






షారుఖ్ మాత్రమే కాదు, దీపికా పదుకోన్ కూడా సోల్జర్ రోల్ చేశారు. ''నేను కూడా సోల్జర్. నీలాగా! మనం ఈ మిషన్ కలిసి చేద్దాం! నువ్వు ఈ మిషన్ లో ఉన్నావా? లేవా?'' అని దీపికా పదుకోన్ చెప్పే డైలాగ్ వింటుంటే... ఆవిడ రోల్ కూడా సూపర్బ్ ఉంటుందని అర్థం అవుతోంది.


అతిథి పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌!?
'పఠాన్' ప్రచార చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో అంశం... హిందీ హీరో రణ్‌వీర్‌ సింగ్‌! అవును... ఆయన ఈ సినిమాలో ఉన్నారని కొందరు భావిస్తున్నారు. దానికి కారణం ట్రైలర్. ట్రైలర్‌లో ఒక వ్యక్తి రణ్‌వీర్‌ జిరాక్స్ కాపీలా ఉండటంతో అతడి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాకపోతే అతడు  రణ్‌వీర్‌ కాదు. ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  


తెలుగులోనూ జనవరి 25న విడుదల
'పఠాన్' సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్పై ఫిల్మ్ అని చెప్పవచ్చు. షారుఖ్ గూఢచారిగా కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. పాటలతో పాటు టీజర్, ట్రైలర్‌ను మూడు భాషల్లో విడుదల చేశారు.


Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?  


'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాల్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జోడీ నటించింది. మొదటి రెండు సినిమాల్లో వాళ్ళ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. 'పఠాన్'లోనూ షారుఖ్, దీపిక ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు.