బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ నటిస్తున్న తాజా సినిమా ‘జవాన్’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు.  షారుఖ్‌ సరసన నయనతార హీరోయిన్‌ గా నటిస్తోంది.


ఫ్యాన్స్‌కు షారుఖ్ అదిరిపోయే ట్రీట్


‘జవాన్’ షూటింగ్ కోసం చెన్నైకి వెళ్లిన కింగ్ ఖాన్,  షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాక అభిమానులను ప్రత్యేకంగా కలిశారు. వారికి జీవితంలో మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు. తను బస చేస్తున్న హోటల్‌లోనే ఫ్యాన్స్ కోసం రూమ్స్ బుక్ చేశారు. మెనూ నుంచి వారికి నచ్చిన ఫుడ్ తీసుకునే అవకాశం కల్పించారు. చివరకు వారందరితో కలిసి ఎంతో జాలీగా గడిపారు. ఫోటోలు దిగారు. ఈమేరకు  SRKChennaiFC ట్విట్టర్ అకౌంట్ లో షారూఖ్ చెన్నై అభిమానుల సంఘం ‘మీట్ అండ్ గ్రీట్’కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది. “షారుఖ్ తో మా చెన్నై కుటుంబం. థ్యాంక్యూ సర్ & టీమ్ ఫర్ ఎవ్రీథింగ్” అని క్యాప్షన్ పెట్టింది. తన ఫ్యాన్స్ క్లబ్‌లోని సుమారు 20 మంది అభిమానులతో షారూఖ్ ఫోటోలకు పోజులివ్వడం ఈ  ఫోటోలో కనిపించింది. షారూఖ్ వీరాభిమాని సుధీర్ కొఠారి ఈ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాండిల్ చేస్తున్నాడు.



20 మంది ఫ్యాన్స్ తో  మీటింగ్   


ఇక ఫ్యాన్స్ తో షారుఖ్ మీట్ ఎలా జరిగిందో సుధీర్ కొఠారి వివరించాడు. “నేను, నాతో పాటు పూజా దద్లానీ, కరుణా (బద్వాల్) కలిసి షారుఖ్ సర్ ను కలవాలని మేనేజర్ ను సంప్రదించాం. ఆయన షారుఖ్ గారికి విషయం చెప్తాను అని అన్నారు. ఒక రోజు అనుకోకుండా మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. షూట్ పూర్తయ్యాక సార్ సమమ్మల్ని కలవాలనుకుంటున్నారు చెప్పాడు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 8న ‘జవాన్’ చెన్నై షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. ఫ్యాన్స్ క్లబ్ నుంచి  20 మందిని ఈ మీట్‌కు ఎంపిక చేయాలని నాకు చెప్పారు. అంతేకాదు, షారుఖ్ బస చేసిన హోటల్ లోనే మేం ఉండేందుకు రూమ్స్ బుక్ చేసినట్లు  చెప్పారు. మా అవసరాలన్నీ దగ్గరుండి చూసుకునేందుకు ఇద్దరు బట్లర్లతో పాటు ఒక మేనేజర్ కేటాయించారు. మేము మెనూ నుంచి నచ్చినవి ఆర్డర్ చేశాం. చివరకు సార్ మమ్మల్ని తన సూట్‌లో కలవాలనుకుంటున్నారని చెప్పారు. మేమంతా వెళ్లి కలిశాం. మాతో చాలా సేపు టైం స్పెండ్ చేశారు. అతడితో మేమంతా ఫోటోలు తీసుకున్నాం. మేం ఇచ్చిన బహుమతులను ఆయన తీసుకున్నారు. మేం ఆయనతో ఎంతో సంతోషంగా గడిపాం” అని చెప్పాడు.


Also Read:‘చంద్రముఖి’గా అలరించబోతున్న చందమామ


ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటించిన  ‘ప‌ఠాన్’ విడుద‌ల‌కు రెడీ అయ్యింది.  సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో  దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంతో పాటు రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వంలో  ‘డుంకి’ అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ఇందలో షారుఖ్‌ సరసన తాప్సీ నటిస్తోంది. 2018లో వ‌చ్చిన ‘జీరో’ షారుఖ్ కు సంబంధించిన మరే సినిమా విడుదల కాకపోవడం విశేషం.