టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. విడాకుల తరువాత నటిగా తన జోరు మరింత పెంచింది. వరుస ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటూ బిజీ స్టార్ గా మారింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత.. ఇప్పుడు 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈరోజు సమంత పుట్టినరోజు కావడంతో 'శాకుంతలం' చిత్రబృందం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తూ.. సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. 


ఈ పోస్టర్ లో సమంత తెల్ల చీర కట్టుకొని దేవకన్యలా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు.. అందులో సమంత 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో శ్రీదేవి మాదిరి కనిపించింది. ఈరోజు సమంత నటిస్తోన్న సినిమాల నుంచి మరిన్ని కొత్త పోస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక శాకుంతలం సినిమా విషయానికొస్తే.. పురాణాల బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగనుంది. 


ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 


Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు