సమంత రూత్ ప్రభు (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శాకుంతలం' (Shakuntalam Movie). గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉంది. అయితే, ఆల్రెడీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. 


ప్రైమ్ వీడియోకి 'శాకుంతలం'?
'శాకుంతలం' ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సమంత లాస్ట్ సినిమా 'యశోద' రైట్స్ కూడా ప్రైమ్ దగ్గర ఉన్నాయి. 


ఒక్క యశోద మాత్రమే కాదు... సమంత సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్. అంతకు ముందు 'అత్తారింటికి దారేది', 'మజిలీ', 'జాను', 'రంగస్థలం', 'యూ టర్న్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... సమంత సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ప్రైమ్ వీడియోలో ఉన్నాయి.
 
'శాకుంతలం' ట్రైలర్ విడుదలైన తర్వాత నెగిటివిటీ ఎక్కువ వచ్చింది. సీరియల్ గ్రాఫిక్స్ చేసినట్టు చేశారని, సినిమాలా లేదని కామెంట్స్ వచ్చాయి. అయినా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందంటే సమంత స్టార్‌డమ్‌కు ఇదొక ఉదాహరణ. 


ఫిబ్రవరి 17న 'శాకుంతలం' విడుదల
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఆ రోజు ధనుష్ 'సార్', విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలు కూడా ఉన్నాయి. అయితే... అందరి చూపు సమంత సినిమాపై ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'యశోద'తో భారీ వసూళ్ళు సాధించిన శామ్, ఈ సినిమాతో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి. 


అసుర పాత్రలో కబీర్
గోపీచంద్ 'జిల్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయమైన కబీర్ సింగ్ ఉన్నారు కదా! ఆయన ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. 'శాకుంతలం'లో కింగ్ అసుర క్యారెక్టర్  తన కెరీర్‌లో మైలురాయి అని కబీర్ సింగ్ చెబుతున్నారు. అతని మార్షల్ ఆర్ట్స్ పెర్ఫార్మన్స్ చూసి గుణశేఖర్ అతడికి లుక్ టెస్ట్ చేశారట. ఆ తర్వాత అసుర పాత్రకు ఫైనలైజ్ చేశారు. 'శాకుంతలం' సినిమాలో అందమైన ప్రేమకథ మాత్రమే కాదు...  దుష్యంతుడికి, అసురకు మధ్య భారీ యుద్ధ సన్నివేశం ఉంది. పది రోజుల పాటు ఆ వార్ సీక్వెన్స్ తీశారు. సినిమాలో ఆ ఫైట్ కూడా హైలైట్ అవుతుందని సమాచారం. 


Also Read : రాజమౌళిని పొగిడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకోవడం ఏంట్రా బాబు?


ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం. చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో సీజీ వర్క్ కోసం సమయం తీసుకున్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయని, చివరకు వచ్చాయని తెలిసింది. 


Also Read : 'లైగర్' అప్పులు, గొడవలు - పూరి జగన్నాథ్‌ను వెంటాడుతున్న డిస్ట్రిబ్యూటర్లు?