సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శాకుంతలం' (Shaakuntalam Movie). శకుంతల పాత్రలో ఆమె కనిపించనున్న సంగతి తెలిసిందే. శకుంతల అంటే... ఆమెతో పాటు గుర్తుకు వచ్చే వ్యక్తి దుష్యంత మహారాజు. ఈ సినిమాలో ఆ పాత్రను మలయాళ హీరో దేవ్ మోహన్ (Dev Mohan) చేస్తున్నారు.
దేవ్ మోహన్‌కు బర్త్ డే గిఫ్ట్‌గా...
'శాకుంతలం'లో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవంలో ఆయన సందడి చేశారు. దుష్యంతుడి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు వెల్లడించారు కూడా! లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఈ రోజు దేవ్ మోహన్ పుట్టిన రోజు (Dev Mohan Birthday). ఈ సందర్భంగా సినిమాలో ఆయన లుక్ విడుదల చేశారు.
అందమైన రాజుగా...
'శాకుంతలం' సినిమా నుంచి విడుదలైన దేవ్ మోహన్ ఫస్ట్ లుక్ (Dev Mohan First Look) చూస్తే... కలర్‌ఫుల్‌గా ఉంది. ఆయన చాలా అందంగా కనిపిస్తున్నారు. 'హ్యాపీ బర్త్ డే టు అవర్ ఛార్మింగ్ అండ్ వాలియంట్ కింగ్ దుష్యంత్' అని చిత్రబృందం పేర్కొంది.
'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమాలో కింగ్ అసుర పాత్రలో, విలన్‌గా గోపీచంద్ 'జిల్' ఫేమ్ కబీర్ సింగ్ నటించారు. 'శాకుంతలం' సినిమాలో ఆయనకు, దేవ్ మోహన్‌కు మధ్య భారీ యుద్ధ సన్నివేశం ఉందట.
Also Read : రజనీకాంత్ ఫ్యాన్స్‌ను శాటిస్‌ఫై చేయడం కష్టం, అందుకే
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : భర్తకు నయనతార సర్‌ప్రైజ్... అక్కడికి తీసుకువెళ్ళి మరీ