జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ (AAT) ఫలితాలను ఐఐటీ బాంబే సెప్టెంబరు 17న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి తమ ర్యాంకు కార్డును పొందవచ్చు. ఐఐటీ బాంబే సెప్టెంబరు 14జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా దేశంలోని ఐఐటీల్లో బ్యాచిరల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11న వెలువడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 12 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన 'జోసా కౌన్సెలింగ్' ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులు కూడా జోసా కౌన్సెలింగ్ ద్వారానే ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతారు.
JEE Advanced AAT 2022 ఫలితాలు ఇలా చూసుకోండి:




  1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి. - jeeadv.ac.in




  2. అక్కడ హోంపేజీలో కనిపించే 'JEE Advanced AAT 2022 Result' లింక్ మీద క్లిక్ చేయాలి.




  3. JEE Advanced AAT రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, మోబైల్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.




  4. కంప్యూటర్ స్క్రీన్ మీద JEE Advanced AAT 2022 ఫలితాలకు కనిపిస్తుంది.




  5. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.




      JEE Advanced AAT Results 2022


JosAA Portal For Registration


జోసా కౌన్సెలింగ్ షెడ్యూలు
జోసా' కౌన్సెలింగ్‌లో భాగంగా.. జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సెప్టెంబరు 12 నుంచి తమకు నచ్చిన విద్యాసంస్థలో సీటు కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. తదనంతరం విద్యార్థుల అవగాహన కోసం మాక్‌ సీటు అలకేషన్‌ను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 18న మొదటి విడత మాక్ సీట్ల కేటాయింపు, సెప్టెంబరు 20న రెండో విడత మాక్ సీట్లను ప్రకటించనున్నారు. సెప్టెంబరు 20తో ఆప్షన్ల నమోదు ప్రకియ ముగియనుంది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 6 రౌండ్లలో కౌన్సెలింగ్‌‌ కొనసాగనుంది. సెప్టెంబరు 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు
                 ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
JoSAA కౌన్సెలింగ్ ఇలా..
 1వ రౌండ్‌ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు
♦ 
2వ రౌండ్‌: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు
♦ 
3వ రౌండ్‌: అక్టోబరు 3 నుంచి 7 వరకు
♦ 
4వ రౌండ్‌: అక్టోబరు 8 నుంచి 11 వరకు
 5వ రౌండ్‌: అక్టోబరు 12 నుంచి 15 వరకు
♦ 
6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు


6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

♦ 
1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3
♦ 4వ రౌండ్‌: అక్టోబరు 8
♦ 5వ రౌండ్‌: అక్టోబరు 12
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16


 


Also Read:
APOSS Admissions: ఏపీ సార్వత్రిక విద్యాపీఠంలో పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి  విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:
NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..