మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని చెప్పగానే.. లోకల్, నాన్ లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. ఆయన తెలుగువాడు కాదని.. 'మా' ఎన్నికల్లో ఎలా పోటీ చేశారంటూ ప్రశ్నించారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ నిర్వహించిన నరేష్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ కామెంట్స్ వేశారు. మంచు విష్ణుకి మద్దతు తెలిపే క్రమంలో.. విష్ణు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడని.. ఏదైనా సాయం కావాలన్నా వెంటనే చేస్తాడంటూ లోకల్ అనే విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు.
Also Read: విష్ణు అలా అనడం బాధేసింది.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
తాజాగా ఈ అంశాలపై హీరో సుమ మాట్లాడారు. వైజాగ్ లోని గాజువాక వాడ్కాయ్ కరాటే చాంపియన్ షిప్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. 'మా' ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అని అనడం కరెక్ట్ కాదని.. సినీ ఆర్టిస్ట్ లకు లోకల్, నాన్ లోకల్ అని ఉండదని అన్నారు. ఇండియాలో పుట్టినవారంతా కూడా లోకలే అని అన్నారు. ఆఫర్లు వస్తే ఏ రాష్ట్రంలోనైనా.. పనిచేస్తామని అన్నారు.
ఎంతోమంది సీనియర్ ఆర్టిస్ట్ లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కనీస వసతులు కూడా లేని జూనియర్, సీనియర్ ఆర్టిస్టులకి ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్ మందులు కొనుక్కునే స్తోమత లేని ఆర్టిస్టులు ఉన్నారని.. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లు అలాంటి వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. 'మా' అభివృద్ధికి అందరూ కృషి చేయాలని చెప్పారు. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు.
Also Read:త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్
Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?
Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?
Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం