'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ ప్రతాప్. తెలంగాణకు చెందిన ఈ అబ్బాయి, ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు.  అల్లు అర్జున్ తర్వాత అదే స్థాయిలో హైలెట్ అయ్యాడు జగదీష్. ఏంది మచ్చా? అంటూ తను మాట్లాడిన పలాస యాస అందరి మనసులలో ముద్రించుకు పోయింది. ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమాలోనూ అంతే ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు జగదీష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కింది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. అయితే, థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.  






జగదీష్ ప్రతాప్ హీరోగా 'సత్తిగాని రెండెకరాలు', నేరుగా ఓటీటీలో విడుదల


‘పుష్ప’ సినిమాను నిర్మించిన  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, ‘సత్తిగాని రెండెకరాలు’ పేరుతో ఓ కాన్సెప్టెడ్ మూవీ తెరకెక్కించింది. ఇందులో జగదీష్ ప్రతాప్ హీరోగా నటించాడు. ఈ చిత్రంతోనే మైత్రి మూవీస్ సంస్థ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమా ఓటిటి వేదికగా ఈ నెల 17న విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా చేస్తున్న టైంలోనే సుకుమార్ రికమండేషన్ తో ఈ సినిమాలో జగదీష్ కు హీరోగా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మోహనశ్రీ సహా పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు.  సమస్యల్లో నుంచి బయటపడేందుకు ఉన్న రెండెకరాల పొలం అమ్మాలా? చావాలా? అనే పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు.   


అభినవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెకిన 'సత్తిగాని రెండెకరాలు'


జగదీష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఇంచుమించు  పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రకటనలు లేకుండా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో పాటు విడుదలకు రెడీ అయ్యింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను, అభినవ్ రెడ్డి దండ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు.  'సత్తిగాని రెండెకరాలు' చిత్రం ‘ఆహా’ ఓటీటీలో నేరుగా  రిలీజ్ కాబోతోంది.


Also Read'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ






Read Also: షారుఖ్, రాణి ముఖర్జీల బోల్డ్ సీన్‌‌పై ఆదిత్య చోప్రాతో గొడవ పడ్డా: కరణ్ జోహార్