డేళ్ల విరామం తర్వాత కరణ్ జోహార్ మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నారు. రణవీర్ సింగ్, ఆలియా భట్  హీరో, హీరోయిన్లుగా ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ పేరుతో  ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్,  ‘కభీ అల్విదా నా కెహ్నా’ సినిమా విషయంలో ఆదిత్య చోప్రాతో జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఆయనతో గొడవ ఎందుకు జరిగిందో వివరించారు.


ఆ విషయంలో ఆదిత్యతో పెద్ద గొడవ జరిగింది- కరణ్


2006లో ‘కభీ అల్విదా నా కెహ్నా’ సినిమా విడుదలైంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘వ్యభిచారం’ చుట్టూ తిరుగుతుంది. ఇందులో షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా, అభిషేక్ బచ్చన్ నటించారు. అమితాబ్ బచ్చన్, కిర్రాన్ ఖేర్, అహ్సాస్ చన్నాతో పాటు కాజోల్, జాన్ అబ్రహం, అయాన్ ముఖర్జీ ప్రత్యేక కామియోస్‌లో నటించారు. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ మధ్య శృంగార సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆదిత్య చోప్రాతో తాను పెద్ద పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. “ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. అక్కడ బాగా మంచు కురుస్తోంది. అక్కడే ఆదిత్యా చోప్రా కూడా ఉన్నారు. ఈ సినిమాలోని బోల్డ్ సీన్ గురించి అతడికి వివరించాను. అప్పుడు తను ఏమన్నారంటే.. “వినండి, నేను గత రెండు రోజులుగా ఈ సీన్ గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించి, ఆలోచించి.. నా తల బరువెక్కిపోయింది. రాణి, షారుఖ్ మధ్య ఈ శృంగార సన్నివేశం ఉండాలని నేను కోరుకోవడం లేదు. ప్రజలు దాన్ని అంగీకరించరని నేను భావిస్తున్నాను” అన్నారు.


అతడిదే సరైన నిర్ణయం అనుకున్నా- కరణ్


అక్కడితో ఈ చర్చ ఆగిపోలేదని కరణ్ చెప్పాడు. ఫోన్ లోనూ తమ చర్చ కొనసాగిందన్నారు. “మేము ఫోన్ లోనూ ఈ విషయం గురించి పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. అతడిపై తిరుగుబాటు చేశాను. ఆ తర్వాత చాలా సేపు ఆలోచించాను. అతడి నిర్ణయమే సరైనదని భావించాను” అని కరణ్ వివరించాడు. అప్పట్లో  విదేశాలలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా ‘కభీ అల్విదా నా కెహ్నా’ నిలిచింది. 


రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ నటిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా తర్వాత కరణ్ ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమా చేయనున్నారు. ఏడు సంవత్సరాల విరామం తర్వాత రణవీర్ సింగ్ - అలియా భట్ హీరో హీరోయిన్లుగా కరణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’,  ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలతో కరణ్ బ్లాక్ బస్టర్స్ సాధించాడు.   






Read Also: అప్పట్లో అదోలా చూసేవారు - స్కూల్ డేస్‌‌ను గుర్తుతెచ్చుకున్న తమన్నా