తాజాగా కన్నడ నాట బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించింది.  ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ సినిమా ముందుగా కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. టాలీవుడ్ లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందమైన జీవితాన్ని గడిపేందుకు చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడే వేదనని ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు.  ఈ నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్ గా ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  


ఆకట్టుకుంటున్న సీక్వెల్ టీజర్


‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ సినిమాను  నవంబర్ 17న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సినీ అభిమానులకు ఆకట్టుకుంటోంది. తొలి సినిమాలోని కథను ఎక్కడా మిస్ చేయకుండా ఈ సినిమాకు లింక్ పెట్టారు దర్శకుడు. తొలి సినిమాలోని టెంపోనూ ఇందులోనూ కంటిన్యూ చేశారు.  హీరో జైల్లో ఉన్న సీన్ తో స్టార్ట్ అయ్యి తన ప్రియురాలు చెప్పే మాటలను ట్రాన్సిస్టర్ లో వింటున్నట్లుగా చూపించారు. ఇక ఒకే టీజర్ లో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ డైలాగులు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ కు చరణ్ రాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.



ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా చైత్ర  


ఇక ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ లో చైత్ర జే ఆచార్ కూడా హీరోయిన్‌గా కనిపించనుంది. పరమ్వాహ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చరణ్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.


 






Read Also: ‘టైగర్ 3’లో టవల్ సీన్‌పై స్పందించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ - ఆ సన్నివేశానికి అన్ని రోజులు పట్టిందా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial