‘టైగర్ జిందా హై’తో మంచి హిట్ అందుకున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్,  ‘టైగర్ 3’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో సల్మాన్ ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక కత్రినా కైఫ్ బాత్ టవల్ సీన్ బాగా అలరిస్తోంది. ఈ టవల్ సీక్వెన్ కోసం చాలా కష్టపడినట్లు హాలీవుడ్ నటి మిచెల్ లీ తాజాగా వెల్లడించింది.


ఆకట్టుకుంటున్న బాత్ టవల్ సీక్వెన్స్


‘టైగర్ 3’ సినిమాలో కత్రినా కైఫ్ జోయా అనే పాత్ర పోషిస్తోంది. తాజా ట్రైలర్ లో పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ సన్నివేశాల్లో కనిపించింది. ట్రైలర్ చివర్లో​ 5 సెకన్ల పాటు వచ్చిన టవల్​ ఫైట్ మరింత స్పెషల్ గా నిలిచింది. ఇందులో బాత్ టవల్స్​ ధరించిన ఉన్న కత్రినతో పాటు మిచెల్ లీ ఫైట్ చేస్తూ కనిపించారు. ఈ నేపథ్యంలో ఒకరి టవల్ ఒకరు లాగేసి ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారు. ఈ బోల్డ్ సీన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ సీన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా హిట్ కావడానికి ఈ ఒక్క సీన్ చాలు అనే టాక్ నడుస్తోంది.  


టవల్ సీన్ కోసం ఎంతో కష్టపడ్డాం- మిచెల్ లీ 


ఇక హాలీవుడ్ లో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించిన హాలీవుడ్ స్టార్ మిచెల్ లీ  ‘టైగర్ 3’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, తాజాగా ఈ టవల్ సీన్ కోసం ఏకంగా రెండు వారాల పాటు కష్టపడినట్లు చెప్పింది. నిపుణుల సమక్షంలో ఎంతో కష్టపడి సాధన చేసినట్లు చెప్పింది. సెట్ డిజైన్ చాలా అందంగా ఉందని చెప్పిన ఆమె ఫైట్ సీక్వెన్స్ చేయడం మరింత సరదాగా అనిపించిందన్నారు. ఇండియన్ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అటు కత్రినా నటనపైనా ఆమె ప్రశంసలు కురిపించారు. ఆమె ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఎంతో కష్టపడి చేసిందని చెప్పారు. ఆమె చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని చెప్పింది. కొరియోగ్రఫీలో అనుభవం ఉండటంతో యాక్షన్ సీక్వెన్స్ ఈజీగా చేసిందన్నారు. తాను మాత్రం ఈ సీన్ కోసం చెమటలు చిందించాల్సి వచ్చిందన్నారు.   


 ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్- కత్రినా


ఇప్పటికే ఈ సినిమాలో జోయ పాత్ర పోషించడం పట్ల కత్రినా సంతోషం వ్యక్తం చేసింది. “యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లో జోయా తొలి మహిళా క్యారెక్టర్. నేను ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. జోయా ఈ సినిమాలో చాలా ధైర్యవంతురాలిగా కనిపిస్తుంది. అంతేస్థాయిలో క్రూరంగా కనిపిస్తుంది. తను ఎప్పుడూ మానవత్వంతో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్ లాంటిది” అని కత్రినా తెలిపింది. ‘టైగర్ 3’ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లో ఆదిత్య చోప్రా నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా  నవంబర్ 12 విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.


Read Also: శ్రద్ధా, పూజా హెగ్డే మాత్రమే కాదు... సోనాల్ చౌహన్ కూడా - కొత్త కారు కొన్న హీరోయిన్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial