ఖరీదైన కార్లు కొనేది హీరోలు మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే! హీరోలకు ధీటుగా హీరోయిన్లు సైతం కోట్ల రూపాయల విలువ చేసే కార్లు కొంటున్నారు. ఈ విజయ దశమికి అందాల భామలు అందరూ కలిసి కార్లు కొనాలని టార్గెట్ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు ఏమో!? ఒకరి తర్వాత మరొకరు కొత్త కార్లను తమ తమ ఇళ్లకు తీసుకు వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో సోనాల్ చౌహాన్ కూడా జాయిన్ అయ్యారు.


బెంజ్ కారు కొన్న 'లెజెండ్' బ్యూటీ
Sonal Chauhan Buys New Car : విజయ దశమికి సోనాల్ చౌహాన్ కూడా కొత్త కారు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ కారును ఆమె కొనుగోలు చేశారు. సోనాల్ కొన్న బెంజ్ ఈ క్లాస్ కారు ఖరీదు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. అయితే... రూ. 4 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని కారును శ్రద్ధా కపూర్, మూడు కోట్ల కంటే ఎక్కువ ఖరీదు గల రేంజ్ రోవర్ కారును పూజా హెగ్డే కొనడంతో సోనాల్ కారును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అదీ సంగతి! 


Also Read  'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? మహేష్...






'జన్నత్' సినిమాతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సోనాల్ చౌహాన్ కథానాయికగా పరిచయం అయ్యారు. అందులో ఇమ్రాన్ హష్మీకి జోడీగా ఆమె నటించారు. ఆ తర్వాత 'రెయిన్ బో' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే... గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించిన 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాలు ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ గుర్తింపు తెచ్చాయి.


Also Read : 'టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ - టిల్లన్నగా స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?


'ఎఫ్ 3'లో కూడా సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ చేశారు. ఆ తర్వాత నాగార్జున 'ఘోస్ట్' సినిమాలో కూడా హీరోయిన్ రోల్ చేశారు యాక్టింగ్ కంటే ఆమె గ్లామర్ ఎక్కువ హైలైట్ అవుతూ వస్తోంది. అయితే... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో మండోదరి పాత్రలో సోనాల్ చౌహాన్ మెరిశారు. త్వరలో 'దర్ద్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సోనాల్. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial