Siddhu Jonnalagadda's Tillu Square release date announced : స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు టిల్లు క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. ఆ పాత్రలో ఆయన యాక్టింగ్ అంత ఇంపాక్ట్ చూపించింది. 'డీజే టిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సిద్ధూ జొన్నలగడ్డ ఫుల్లుగా వినోదం పంచారు. టిల్లు అంటే సిద్ధు, సిద్ధు అంటే టిల్లు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించారు.
ఫిబ్రవరి 9న 'టిల్లు స్క్వేర్' విడుదల
'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' (Tillu Square Movie)తో మరోసారి టిల్లు పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రేక్షకులను అలరించనున్నారు. మొదటి సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ కాగా... ఇప్పుడీ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
'టిల్లు స్క్వేర్' చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాత. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై 'టిల్లు స్క్వేర్' సినిమా తెరకెక్కుతోంది. 'డీజే టిల్లు' తరహాలో ఈ సినిమా కూడా కల్ట్ స్టేటస్ అందుకుంటుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read : 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? మహేష్...
ఆల్రెడీ విడుదలైన 'టిక్కెట్టే కొనకుండా...' పాట, అందులో అనుపమ పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 'డీజే టిల్లు'లో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర ఎలా అయితే ప్రేక్షకులు అందరికీ గుర్తుండి పోయిందో... 'టిల్లు స్క్వేర్'లో అనుపమ పాత్ర కూడా ఆ స్థాయిలో గుర్తు ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
'డీజే టిల్లు' సినిమాలో 'టిల్లన్న డీజే కొడితే...' పాట సూపర్ హిట్ అయ్యింది. దానిని రామ్ మిరియాల స్వర పరచడంతో పాటు ఆలపించారు. 'టిల్లు స్క్వేర్'లో 'టిక్కెట్టే కొనకుండా...' పాట కూడా ఆయన సంగీతం, గాత్రంలో రూపొందింది.
Also Read : ఇటువంటి సినిమాలు థియేటర్లలో ఆడితే కొత్త కథలు వస్తాయి - దర్శకుడు వేణు ఊడుగుల
''టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...
సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా...
మూసుకుని కూసోకుండా గాలం వేశావు పబ్బు కాడ...
సొర్రసేప తగులుకుంది తీరింది కదరా
మురిసిపోక ముందున్నాది... కొంప కొల్లేరు అయ్యేతేదీ!
గాలికిపోయే గంప... నెత్తికొచ్చి సుట్టుకున్నాది!
ఆలి లేదు సూలు లేదు... గాలే తప్ప మ్యాటర్ లేదు!
ఏది ఏమైనా గానీ టిల్లుగానికడ్డే లేదు
టిల్లన్నా ఇల్లాగయితే ఎల్లాగన్నా?
స్టోరీ మళ్ళీ రిపీట్ యేనా?
పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా''
అంటూ పాట సాగింది. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్, కూర్పు : 'జాతీయ పురస్కార గ్రహీత' నవీన్ నూలి, సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, కళ: ఏఎస్ ప్రకాష్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు : మల్లిక్ రామ్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial