బాలీవుడ్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఆయన సినిమా ఆఫర్ కోసం టాప్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు. సినిమాలను ప్రజెంట్ చేయడంలో భన్సాలీ స్టైలే వేరు. నటీనటులను గ్రాండ్‌గా చూపించడంలో తనదైన మార్క్ చూపిస్తారు భన్సాలీ. భన్సాలీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నేటికి సరిగ్గా 25 ఏళ్లు అవడంతో స్టార్లంతా ఆయనకు సిల్వర్ జూబ్లీ విషెస్ చెప్పారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే సహా పలువురు బాలీవుడ్ స్టార్లు సంజయ్‌కు విషెస్ చెప్పారు. 


Also Read: MAA Godava : "మా"కు తక్షణమే ఎన్నికలు పెట్టాలని చిరంజీవి డిమాండ్..! కృష్ణంరాజుకు సంచలన లేఖ..!


దీనికి సంబంధించి భన్సాలీ ప్రొడక్షన్స్ ఒక వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో భన్సాలీ సినిమాలన్నింటినీ యాడ్ చేసింది. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, హమ్ దిలేసే చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, గుజారీష్ వంటి సినిమాలను పంచుకుంది. 






సంజయ్ లీలా భన్సాలీకి అజయ్ దేవగణ్ విషెస్






భన్సాలీకి కండల వీరుడు సల్మాన్ కంగ్రాట్స్..