Samantha Ruth Prabhu : మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడి ఇటీవలే కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదన్నట్టు తెలుస్తోంది. అందుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. సామ్  ప్రస్తుతం చూడడానికి బాగానే ఉంది అనిపించినా.. ఇంకా వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు ఆమె శరీరంలో ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 14 పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ‘శాకుంతలం’ త్రీడి ట్రైలర్ విడుదల కోసం ముంబైకి చేరుకున్న సమంత.. ఫొటోల వల్ల కాస్త అసౌకర్యానికి లోనయ్యారు. ఫ్లాష్ చూడలేక ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


గత సంవత్సరం అక్టోబర్ లో తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్‌ వ్యాధితో బాధపడుతున్నానని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా షేర్ వెల్లడించారు. ప్రస్తుతానికైతే ఆ వ్యాధి నుంచి కొంత కోలుకుంటునున్నానని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెబుతున్నారని పోస్ట్‌లో తెలియజేశారు. అంతే కాదు ఆ సమయంలో ‘యశోద’ సినిమాకు డబ్బింగ్ కూడా హాస్పిటల్ నుంచే చెప్పారు. ఈ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సామ్‌ మయోసైటిస్‌తో బాధపడుతుందని తెలిసి ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆ తర్వాత మళ్లీ జనవరి, 2023లో ఆమె మయోసైటిస్ నుంచి కోలుకుందని, మరో కొన్ని రోజుల్లో కెమెరా ముందుకు రాబోతున్నారంటూ కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురించడంతో ఆమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 


ఆ తర్వాత మెల్లగా సినిమా షూటింగుల్లో పాల్గొనడం ప్రారంభించిన సమంత.. ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గుణ శేఖర్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మూవీ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగా సమంత కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ.. ఇటీవలే హీరో నాగ చైతన్యతో విడాకుల అంశంపైనా స్పందించి.. మరోసారి వార్తల్లో నిలిచారు. తాను తన వైవాహిక బంధంలో 100 శాతం ఇచ్చినా వర్కవుట్ కాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ పైనా పలు కామెంట్స్ చేశారు. తనను ఆ సాంగ్ కు ఓకే చేయొద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పారన్నారు. కానీ తాను తప్పేం చేయట్లేదని, ఏం నేరం చేయని తాను ఎందుకు ఇలా దాక్కోవాలి అని నిర్ణయించుకొని ‘ఊ అంటావా..’ సాంగ్ చేశానని స్పష్టం చేశారు.


ఇలా ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సమంత రీసెంట్ డేస్ లో ట్రెండింగ్ లో నిలుస్తు్న్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఈ సినిమా  త్రీడీ ట్రైలర్ విడుదల ఈవెంట్ లో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఫొటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తున్నపుడు కాస్త అసౌకర్యంగా ఫీలైనట్టు తెలుస్తోంది. వాళ్లంతా అలా గ్యాప్ లేకుండా ఫ్లాష్ తో సమంతను ఫొటో తీయడంతో తన చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపించారు. ఆమె అలా అసౌకర్యంగా కనిపించినప్పటికీ, ఫొటో గ్రాఫర్స్ కు స్టిల్స్ ఇస్తూ.. తన అసౌకర్యాన్ని తనలోనే దాచుకుంటూ నవ్వుతున్న ముఖాన్ని కెమెరా ముందు నిలిపారు.


దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, ఇది చూసేందుకు చాలా బాధగా ఉందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.  దయచేసి ఫొటోగ్రాఫర్స్ ఫ్లాష్‌లు ఆపివేయండి.. ఆమె కళ్ళలో సమస్య ఉంది.. ఆ లైట్స్ ఆమెకు ఇబ్బంది పెడుతున్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉండగా ‘శాకుంతలం’ సినిమా శకుంతల పురాణ ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. ఇందులో సమంత శకుంతల క్యారెక్టర్ పోషించారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సమంత అభిమానులతో పాటు పురాణ ప్రేమకథలను ఇష్టపడే సినీ లవర్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Read Also: గలీజ్ కంటెంట్ ఆగాల్సిందే, ఓటీటీకి సెన్సార్‌షిప్‌పై సల్మాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు