సమంత నటించిన ‘యశోద’ మూవీ టీజర్ వచ్చేసింది. ఈ సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో సమంత గర్భవతిగా కనిపించనుంది. గర్భంతోనే ప్రతినాయకులతో పోరాడుతున్న సన్నివేశాలను టీజర్‌లో చూడవచ్చు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ ఈ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇందులో సమంత గర్భం దాల్చుతుంది. కానీ ఆమెలో సంతోషం కనిపించదు. డాక్టర్ ఆమెను మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కానీ, ఆమె కడుపులో శిశువు కడుపులో పడిన రోజు నుంచి ఆమెకు కష్టాలు మొదలవుతాయి. ఆమెను ఎవరో గుర్తుతెలియని ప్రాంతంలో బందిస్తారు. అక్కడి నుంచి సమంత సురక్షితంగా బయటపడేందుకు చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్‌గా ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. గర్భంతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పే సూచలకు వ్యతిరేకంగా ‘యశోద’కు సవాళ్లు ఎదురవుతున్నట్లు టీజర్‌లో కొత్తగా చూపించారు. అయితే, ఆమెను ఎవరు బంధించారనేది మాత్రం మిస్టరీగా మిగిల్చారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న యశోద చిత్రం లో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్స్ రాశారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ‘యశోద’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సమంత అభిమానులు కూడా ఎన్నో రోజులుగా ఈ సినిమా అప్‌డేట్ గురించి ఎదురుచూస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకులు తర్వాత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన సమంతా.. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నది. ఒకదాని తర్వాత మరో పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్–2 వెబ్‌సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్ తర్వాత.. సమంతా.. యశోద సినిమాలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ.. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సో, త్వరలో సామ్ ఫ్యాన్స్‌కు పండగే.
Also Read : 'కెప్టెన్' సినిమా రివ్యూ : ఆర్య గురి తప్పిందా? బావుందా?