సాధారణంగా ఏదైనా కథ విన్నప్పుడు తన నిర్ణయం చెప్పడానికి ఒక్క రోజు టైమ్ తీసుకుంటానని, కానీ 'యశోద' (Yashoda Movie) కథ విన్న వెంటనే ఓకే చేసేశానని సమంత (Samantha) తెలిపారు. తనకు ఈ సినిమా కథ అంత నచ్చిందని ఆమె చెప్పారు. సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 11న పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి సమంత చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...


''యశోద' టీజర్, ట్రైలర్‌కు ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. ఎందుకంటే... సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సినిమాలో ఏం ఉందో... టీజర్, ట్రైలర్‌లో మేం అదే చూపించాం. ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా కూడా వాళ్ళకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.''
     
గూస్ బంప్స్ వచ్చాయి!
''కథ విన్న వెంటనే నేను ఓకే చేసిన సినిమాల్లో 'యశోద' ఒకటి. క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. కథ పవర్‌ఫుల్‌గా ఉండటంతో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులూ అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నా. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశారు''. 


Also Read : 'పోకిరి'లో మహేష్ - 'యశోద' డబ్బింగ్‌లో సమంత!



''కృష్ణుడిని పెంచిన 'యశోద' గురించి మనకు తెలుసు. మా సినిమా చూసిన తర్వాత ఈ 'యశోద' గురించి ప్రేక్షకులు అందరికీ అర్థం అవుతుంది. నేను ఎందుకు ఇలా చెబుతున్నానో... సినిమా చూస్తే అర్థం అవుతుంది. ప్రేక్షకులు కూడా నాతో ఏకీభవిస్తారు''. 


సరోగసీ... పరిష్కారమే! 
Samantha On Surrogacy : ''సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది. 'యశోద'లో సరోగసీ మాత్రమే కాదు... ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమా కథపై నేను ఇంకేం చెప్పినా సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. ఇదొక మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం... స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు... ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్... ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన, చూసి ఎంజాయ్ చేయాల్సిన చిత్రమిది''. 



యాక్షన్... ఎంజాయ్ చేశా!
''ప్రతిసారీ నా సినిమా, అందులో నా రోల్ కొత్తగా... ఆల్రెడీ చేసిన దానికి డిఫరెంట్‌గా ఉండాలని ఆలోచిస్తా. 'యశోద'కు ముందు 'యూ - టర్న్' చేశా. అది థ్రిల్లర్. కానీ,  దాంతో కంపేర్ చేస్తే 'యశోద' కొత్తగా ఉంటుంది. ఇందులో యాక్షన్ కూడా కొత్తగా ఉంటుంది. నేను తొలిసారి 'ఫ్యామిలీ మ్యాన్ 2' కోసం ఫైట్స్ చేశా. 'యశోద'లో నాది ప్రెగ్నెంట్ లేడీ రోల్ కాబట్టి... అందుకు తగ్గట్టు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్ ఫైట్స్ డిజైన్ చేశారు. రియల్ అండ్ రాగా ఉండేలా చూశారు. యాక్షన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను''.



నిర్మాత భారీ సెట్స్ వేశారు!
''సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం మొదట లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చూశారు. అయితే, ఏవీ మాకు సెట్ కాలేదు. దాంతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ సెట్ వేశారు. ఆయనకు ఎప్పుడూ సినిమా గొప్పగా ఉండాలనే తపన. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. కథ విన్నప్పుడు ఇందులోని పొటెన్షియల్ మాకు అర్థమైంది. ఇందులో గొప్ప ఎమోషన్ ఉంది. అందుకని, పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. పాన్ ఇండియా హిట్ వస్తుందని ఆశిస్తున్నాం. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ పెరిగింది''.


Also Read : నేనింకా చావలేదు - ఆ వార్తలపై స్పందిస్తూ ఏడ్చేసిన సమంత


కథలో ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పిన సమంత... తన క్యారెక్టర్ కాకుండా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర నచ్చిందన్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే సినిమా చూడమన్నారు.