మ్మాయిలకు ఎంతో ఇష్టమైనది మెహందీ లేదా గోరింటాకు. పండుగలు, వేడుకలు, పెళ్ళిళ్ళు.. ఇలా ఏదైనా ఆడవారి చేతులకి గోరింటాకు లేనిదే ఆనంద వాతావరణం ఉండదు. మెహందీ చేతులకి అందాన్ని ఇచ్చేందుకే కాదు, తెల్లు జుట్టును మాయం చేసే హెన్నాలా కూడా పనిచేస్తుంది. ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండేది. కానీ, ఇప్పుడు చాలా సులభంగా హెన్నా, మెహందీ రూపంలో గోరింటాకు పొడి లభిస్తోంది. తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్ళు దాన్ని పోగొట్టుకునేందుకు హెన్నా తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాటిలో కూడా రంగులు వచ్చేశాయి. జుట్టుని పోషించడానికి కండిషన్ గా చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది రాసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.


హెన్నాకి ప్రత్యామ్నాయంగా రసాయన ఆధారిత జుట్టు రంగులు కూడా ఉంటున్నాయి. అవి కాస్త ఖరిదైనవి కానీ వేగవంతమైన ఫలితాలు ఇస్తాయి. నలుపు, గోధుమ రంగు, రాగి ఇలా రకరకాల రంగుల్లో హెన్నా లభిస్తుంది. ఇవి వేసుకోవడం వల్ల జుట్టు ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కానీ రసాయన ఆధారిత రంగుల కారణంగా జుట్టు సంరక్షణ సంగతేమో కానీ అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో అమ్మోనియా, ఇథలోనమైన్, డైథలోనమైన్, ట్రైథలోనమైన్ ఉంటాయి. వీటి వల్ల స్కాల్ఫ్ అలర్జీలు ఏర్పడతాయి. జుట్టు పెళుసుగా మారిపోతుంది. వాటి వల్ల కొందరికి క్యాన్సర్ కూడా రావచ్చు.


హెన్నా వల్ల ప్రయోజనాలు


ఇప్పుడు మళ్ళీ అందరూ పాత స్టైల్ లో గోరింటాకు నుంచి హెన్నా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హెన్నా జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది. హెయిర్ డై తో పోలిస్తే ఇదే చాలా సహజమైన అందం ఇస్తుంది. సెలూన్ లేదా పార్లర్ కి వెళ్ళే బదులు ఇంట్లోనే సులభంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. గోరింటాకులని తీసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. తర్వాత దాన్ని తలకి పట్టించుకోవడం వల్ల మెరిసే జుట్టు మీరు పొందవచ్చు. సహజమైన హెన్నా ఉపయోగించడం వల్ల స్కాల్ఫ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోరింటాకు ఎండబెట్టుకుని పొడిగా చేసుకుని కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. దానిమ్మ తొక్కలు, బీట్ రూట్ మొదలైన సహజ పదార్థాలు కూడా జోడించుకుని హెన్నా రంగు మారేలాగా చేసుకుని జుట్టుకి అప్లై చేసుకోవచ్చు.


హెన్నా సహజ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకి సహజమైన అందాన్ని ఇచ్చి మృదువు ఉండేలా విటమిన్ ఈ, టానిన్ లను కూడా అందిస్తుంది. హెన్నా అప్లై చేసిన ఒక రోజు తర్వాత జుట్టుకి నూనె రాయడం వల్ల సహజ కండిషనర్ గా ఉంటుంది. హాట్ ఆయిల్ మసాజ్ హెన్నా రంగు ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. తలకి పోషణ అందించడమే కాదు స్కాల్ప్ pHని బ్యాలెన్స్ చేస్తుంది. జుట్టులో నూనెను ఉత్పత్తి చేసే అతి చురుకైన సేబాషియస్ గ్రంధులను శాంతపరుస్తుంది. ఇది జుట్టులో వచ్చే నూనెని నియంత్రించి స్కాల్ఫ్ జిడ్డుగా లేకుండా చేస్తుంది. ఇదే సమస్య ఇంకా కొనసాగితే అందులో కొద్దిగా ముల్తానీ మట్టిని హెన్నాతో కలిపి 3-4 గంటల పాటు తలకి పట్టించిన జిడ్డు సమస్య వదులుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పొట్టలో తరచూ అసౌకర్యంగా అనిపిస్తుందా? జాగ్రత్త, అది క్యాన్సర్ సంకేతం కావొచ్చు