వరంగల్ జిల్లాలో విషాదం ఆవరించింది. ఆగిఉన్న లారీని ఇన్నోవా ఢీకొన్న ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో విషాద ఛాయలు నింపిపింది. 


వరంగల్‌లోని పెరికవాడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఒంగోలు వెళ్లింది. పని ముగించుకొని ఇన్నోవా కారులో తిరిగి బయల్దేరారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామన్న టైంలో అనుమాని ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వీళ్లు ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలతో ఉన్న ఆరుగురిని స్థానికులు వరంగలల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించార. అక్కడ చికిత్స అందిస్తున్నారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. కారులో ఉన్న కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకట సాయి రెడ్డి మృతి చెందారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న వారిని వరంగల్‌లోని ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.


పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉదయాన్నే దట్టమైన పొగమంచు కమ్మేసింది. ముందరే ఉన్న మనిషి కూడా కనపడనంతలా మంచు కప్పేసింది. దీని కారణంగానే చాలా మంది వాహనదారులు, పాదచారుల అవస్థలు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించక వాహనదారులు భయంభయంగా ప్రయాణించారు. పాదచారుల పరిస్థితీ అంతే. వాహనాలు కనిపించక ప్రమాదాలు కూడా జరిగాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.


భారీ వాహనాలు రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉంచారు. కొంత మంది లైట్స్ వేసుకొని నెమ్మదిగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇలా పార్క్ చేసిన వాహనాన్ని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిపోయింది.