సమంత గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంది. అనంతరం కొద్ది రోజుల్లోనే చక్కటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తొలి సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి కుటుంబ సభ్యులు అగీకారంతో పెళ్లి చేసుకుంది. కొద్ది నెలల క్రితమే అనివార్య కారణాలతో చైతుతో విడిపోయింది. తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సామ్.. మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుని పలు సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు సమంత వెల్లడించింది. ఈమేరకు ఆమె ఓ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ఈ వ్యాధి మూలంగా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నడవడానికి ఉపయోగాపడే కండరాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి. నెమ్మదిగా శరీరం అంతా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
నేను ఇంకా చావలేదు.. కంటతడి పెట్టుకున్న సమంత
తాజాగా ‘యశోద’ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తనకున్న వ్యాధి గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది. “జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి. మరికొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కో రోజు, ఒక్కో సారి ఇంకో అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తిరిగి వెనక్కి చూస్తే.. ఇంతలా ముందుకు వచ్చానా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఇమ్యూనిటీ ఫైటింగ్ చేస్తున్నాను. వచ్చిన సమస్యతో కొట్లాడుతున్నాను. విజయం సాధిస్తాను అనుకుంటున్నాను. నా హెల్త్ కు సంబంధించి చాలా ఆర్టికల్స్ చూశాను. లైఫ్ థ్రెటెనింగ్ లో ఉన్నట్లు రాశారు. కానీ, అవి నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం మాత్రం కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అలాంటి హెడ్ లైన్స్ అనేవి అప్రస్తుతం. కానీ, నా ఆరోగ్య పరస్థితి, నాకున్న వ్యాధి తీవ్రత అనేది కాస్త డిఫికల్ట్ గానే ఉంది. అయినా, నేను శక్తి వంచన లేకుండా దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు” అంటూ సమంత ఏడ్చేసింది.
నీరసంగా కనిపిస్తున్న సమంత
ప్రస్తుతం సమంతా ‘మయోసిటిస్’ కారణంగా బాగా నీరసంగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా చలాకీ తనం, గ్లో మిస్ అయ్యింది. ఈ వ్యాధికి సంబంధించి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. అరుదైన నరాల వ్యాధి బారిన పడినట్టు ప్రకటించాక తొలిసారి ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా డల్ గా కనిపిస్తోంది. సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్‌తో సమంత బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఆవిడ నటించిన 'యశోద' టీజర్ విడుదల అయ్యింది. నవంబర్ 11న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్ర చేశారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. 'యశోద' కాకుండా సమంత నటిస్తున్న మరో సినిమా 'శాకుంతలం'. గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నది.