సత్య మాధవ్ కి ఫోన్ చేసి దేవి చెప్పిన మాటల గురించి అడుగుతుంది. నా బిడ్డ అలా అన్నదా ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉందా, నా బిడ్డ నేను తండ్రిని కాదు అని చెప్పడం ఏంటి అలా అని రాధ, ఆదిత్య కలిసి చెప్పించి ఉంటారని మాధవ్ అంటాడు. వాళ్ళు కాదు మీరే ఆ మాట చెప్పారని చెప్తుందిగా అని సత్య అంటుంది. ‘నేను ఎందుకు చెప్తాను సత్య, రేపు వాళ్ళకి అడ్డు లేకుండా ఉంటానని రాధ దేవికి అలా చెప్పి ఉంటుంది నా కూతురు హఠాత్తుగా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిందా అనుకున్నా నా బిడ్డ మనసు ఇలా కూడా పాడు చేస్తున్నారా? ఈరోజు నా బిడ్డకి తండ్రిని కాదని చెప్పిన వాళ్ళు రేపు రాధకి నేను భర్తని కాదని చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు.. అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. ఈ దారుణం జరగకూడదు నా కాపురం కూలిపోకూడదు అంటే ఆదిత్యని అదుపులో పెట్టాలి అది నీ చేతుల్లోనే ఉంది.. ప్లీజ్ సత్య నా కాపురం నిలబెట్టు’ అని మాధవ్ నటిస్తాడు.


Also Read: మాధవ్ దేవి తండ్రి కాదని తెలిసి షాకైన సత్య- ఆదిత్యతో తిరగొద్దని రుక్మిణికి చెప్పిన రామూర్తి


ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి దేవి అక్కడికి వచ్చిందని చెప్తాడు. నిన్ను వెతకడం కోసమే అమ్మ బయటకి వెళ్ళింది తన దగ్గర నీ ఫోటో కూడా ఉందని చెప్తాడు. వెళ్ళే దారిలో అమ్మ దేవికి నీ ఫోటో చూపిస్తే ఏమవుతోందో తెలుసా అని కంగారుపడతాడు. నువ్వేమి కంగారుపడకు నిజం ఎలా చెప్పాలో అని ఇద్దరం ఆలోచిస్తున్నాం కదా ఇలా అయినా తెలిస్తే తెలియనివ్వు తనని తీసుకుని ఇంటికే వస్తుంది నీకు కావలసింది అదే కదా అని రుక్మిణి ధైర్యంగా చెప్తుంది. దేవి వస్తే మరి నీ పరిస్థితి ఏంటని ఆదిత్య అడిగేసరికి రుక్మిణి ఏమి మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తుంది. సత్య దేవి మాటలు విని నాకు ఫోన్ చేసి అడిగిందంటే అనుమానం వచ్చిందనే కదా, నిజం సత్యకి తెలిసేలోపు రాధని నాదాన్ని చేసుకోవాలని మాధవ్ అనుకుంటాడు.


నేను నిన్ను ఇబ్బంది పెట్టి అయినా నీ మెడలో తాళి కడతాను అంటాడు. దేవుడమ్మ రుక్మిణి గురించి ఆలోచిస్తుంటే దేవి పలకరిస్తుంది. ఫోటో చూపిస్తా అన్నావ్ చూపించావా అని అడుగుతుంది. దేవి దేవుడమ్మ ఫోన్లో రుక్మిణి ఫోటో చూపిస్తుంది. అదే మా రుక్మిణి నా పెద్ద కోడలు ఎక్కడైనా చూశావా అని దేవుడమ్మ అడుగుతుంది. నీ పెద్ద కోడలు కనిపిస్తే ఏం చేస్తావ్ అని దేవి అంటే మరి సత్య పిన్నమ్మకి ఏం కాదా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకున్నారు నా మాట వింటారు అని నమ్మకంగా దేవుడమ్మ చెప్తుంది. ఈ విషయాలన్నీ నీకు ఎందుకే అని దేవుడమ్మ అనేసరికి ఎందుకంటే నీ కోడలు నాకు తెలుసు తను ఎవరో కాదు మాయమ్మే నేను నీ మనవరాలిని అని దేవి చెప్పేస్తుంది.


Also Read: ఇంద్రుడి గురించి దీపని అడిగిన మోనిత- శౌర్యని బలవంతంగా తీసుకెళ్లిపోతున్న ఆనందరావు


దేవుడమ్మ రామూర్తి ఇంటికి వచ్చి రుక్మిణిని చూస్తుంది. రుక్మిణి దగ్గరకి వచ్చిన దేవుడమ్మ తన చెంప పగలగొడుతుంది. నన్ను చస్తూ బతికేలాగా చేసి ఇక్కడ చాటుగా బతుకుతున్నావా అని దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుంది. రాధ గురించి తెలియక మాట్లాడుతున్నారని రామూర్తి అనేసరికి ఏం తెలియాలి అని దేవుడమ్మ అరుస్తుంది. మాయమ్మ ఏం తప్పు చేయలేదని దేవి ఏడుస్తూ చెప్తుంది. తప్పు చేయకపోతే మా కంటికి కనిపించకుండా ఎందుకు తిరుగుతుందని అంటుంది. నా బిడ్డతో తాళి కట్టించుకుని మళ్ళీ మాధవ్ తో తాళి కట్టించుకుందంటే తప్పు కదా అని అరుస్తుంది. ఆ రోజు కాదు ఇప్పుడు నా దృష్టిలో చచ్చిపోయావ్ అని దేవుడమ్మ అనేసరికి దేవి షాక్ అవుతుంది. ఇదంతా దేవి కన్న కల. అమ్మ గురించి చెప్తే అవ్వ ఇలాగే చేస్తుందేమో అని భయపడి నిజం దాస్తుంది.