అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ప్రేమగా ఉండే వీరిద్దరూ విడిపోవడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఈ విషయంలో కొందరు చైతుని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు సమంతను సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డివోర్స్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. 


Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?


బాలీవుడ్ సైతం ఈ విషయంపై దృష్టి పెట్టింది. కంగనా లాంటి స్టార్లు ఈ విడాకులపై స్పందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. సమంత విడాకుల నేపథ్యంలో నటుడు సిద్ధార్థ్ ఒక ట్వీట్ చేశాడు. 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు' అనే కామెంట్ సిద్ధార్థ్.. సమంతను ఉద్దేసిందే అన్నాడనే టాక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గతంలో సిద్ధార్థ్ తో సమంత ప్రేమాయణం నడిపిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రచారం గట్టిగా సాగుతోంది. 


అయితే ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ సిద్ధార్థ్ ను టార్గెట్ చేస్తున్నారు. నిజంగానే సిద్ధార్థ్.. సమంతను మోసగత్తె అని అన్నాడే అనుకుందాం.. మరి సిద్ధార్థ్ కూడా గతంలో వివాహం చేసుకొని ఆ అమ్మాయిని వదిలేశాడు కదా..? ఒక వేళ సిద్ధార్థ్ ను సమంత వదిలించుకొని ఉంటే, అది మోసమే అయితే.. అంతకుముందు సిద్ధార్థ్ లైఫ్ లో జరిగినదానిని ఏమనాలి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 


సిద్ధార్థ్-సమంత ప్రేమించుకున్నారని.. సహజీవనం చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ రూమర్లపై వారిద్దరూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పెళ్లి కాకుండానే ఇద్దరూ విడిపోయారనుకుంటే.. అప్పటికే సిద్ధార్థ్ కి పెళ్లి అయింది. కారణం ఏదైనా కానీ తన భార్య నుంచి విడిపోయాడు సిద్ధార్థ్. విడిపోవడం తప్పనుకుంటే.. మరి అదే తప్పు సిద్ధార్థ్ వేరొకరి విషయంలో చేసినట్లే కదా..! సమంతతో విడిపోయిన తరువాత సిద్ధార్థ్ ఓ బాలీవుడ్ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అది కూడా ఎక్కువ రోజులు సాగలేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న సిద్ధార్థ్ కు విడాకుల విషయంలో సమంతను నిందించే అర్హతే లేదంటూ ఆమె అభిమానులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో సిద్ధార్థ్ సైలెంట్ గా ఉంటే బాగుండేదేమో!


Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?


Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..


Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి