ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత ఏమైందో.. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. విడిపోయిన తర్వాత పెళ్లి నాటి జ్ఞాపకాలు.. పీడ కలలా వెంటాడుతున్నాయో ఏమో.. నాటి తీపిగుర్తులను సమంత పూర్తిగా చెరిపేసిందంటూ వార్తలు వస్తున్నాయి. సమంత తన పెళ్లినాటి ఫొటోలను తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసి తన అభిమానులకు షాకిచ్చినట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


అక్టోబర్ 2న సమంత, నాగచైతన్య తమ నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సామ్.. నాగచైతన్యతో తన పెళ్లి ఫొటోలు, రానా ఎంగేజ్మెంట్‌లో చైతూతో దిగిన చిత్రాలు, గోవాలో న్యూ ఇయర్ వేడుకల చిత్రాల్లో కొన్నింటిని సమంత తొలగించింది. అయితే, చైతూ తీసుకున్న కొన్ని చిత్రాలను మాత్రం అలాగే ఉంచింది. అఖిల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు, అక్కినేని, దగ్గుబాటి కుటుంబంతో ఉన్న ఫొటోలను కూడా ఆమె డిలీట్ చేయలేదు. దీంతో అభిమానులు పెళ్లి ఫొటోలు ఉంచాల్సింది సామ్ అని వాపోతున్నారు. 


చైతూతో సామ్ విడాకులు తీసుకున్న నుంచి మీడియా ఆమె గురించి ఎన్నో తప్పుడు కథనాలను ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో కూడా రూమర్లు చక్కర్లు కొట్టాయి. విడాకులు కంటే వదంతులే ఆమెను ఎక్కువ బాధించాయి. దీంతో ఆమె మూడు తెలుగు యూట్యూబ్ చానెళ్లు, ఓ అడ్వకేట్‌పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. అయితే, కోర్టు వారిని సున్నితంగా హెచ్చరించి వదిలేసింది. ఇటీవలే చార్‌ధమ్ యాత్రను ముగించుకుని వచ్చి సామ్.. షూటింగ్ నిమిత్తం దుబాయ్‌లో పర్యటిస్తోంది. 






Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి