" న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ మహాపాదయాత్ర" చేయాలనుకున్న అమరావతి రైతులకు డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి నిరాకరించారు. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అనుమతి ఇస్తున్నారో లేదో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించండతో ఆయన సరిగ్గా ఐదు గంటల సమయంలో నిర్ణయం తీసుకున్నారు. అనుమతి ఇచ్చేందుకు డీజీపీ గౌతం సవాంగ్ నిరాకరించారు. వారు పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. 


Also Read : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !


దాదాపుగా రెండేళ్లుగా రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమని న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కేసులు న్యాయస్థానంలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వారు రాజధాని అమరావతి వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించాలనుకున్నారు.  తుళ్లూరులోని హైకోర్టు నుంచి తిరుమలలోని శ్రీవారి ఆలయం వరకూ పాదయాత్రకు ప్రణాళికలు వేసుకున్నారు. 


Also Read : జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !


అమరావతి జేఏసీ నేతృత్వంలో సాగే ఈ పాదయాత్రకు విరాళాలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించి  డిసెంబర్ 17వ తేదీన ముగియాల్సి ఉంది. మహా పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం అమరావతి రైతుల మహాపాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతును ప్రకటించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా గురువారం రైతులను పరామర్శించి మద్దతు తెలిపారు.  


Also Read : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?


డీజీపీ అనుమతి నిరాకరించడంతో అమరావతి రైతులు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా శాంతియుతంగా కార్యక్రమాలు పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించడానికి అవకాశం లేదు. కోర్టుల్లో పర్మిషన్లు లభిస్తాయి. అందుకే రైతులు తమకు అనుమతి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. 


Also Read : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి