Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. ఆయన సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0’ లో భాగంగా ఆయన ఈ పని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మొక్కలు నాటడం ఒక బాధ్యత, ఆ బాధ్యతని అందరూ నిర్వర్తించాలి. మొక్క నాటేశాం ఒక పని అయిపోయింది అన్నట్టు కాకుండా, అది పెరిగేవరకు శ్రద్ధ చూపించాలి. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలను కాపాడుకోగలం’ అని చెప్పారు. తరువాత జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘పిలవగానే వచ్చి మొక్కలు నాటినందుకు సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలు’ అని చెప్పారు.  


వాతావరణంలో విపరీత మార్పులకు చెట్లు తగ్గిపోవడమే కారణమని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. వరదలు, విపత్తులతో ప్రపంచం అల్లకల్లోలం అవ్వడానికి, ప్రజల అకాల మరణాలకు వాతావరణ  మార్పులే కారణమని అన్నారు. ఆయన ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమా కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. సల్మాన్ 1988 నుంచి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఎన్నో సినిమాలకు ప్రతిష్థాత్మక అవార్టులు అందుకున్నారు. 







Also read: నేను బిగ్‌స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను: జాన్ అబ్రహం


Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా