Salaar Movie: సినీ అభిమానులు ఎంతగానో ఎదరు చూస్తున్న ‘సలార్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల విడుదలైన ఈ మూవీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమ ఫేవరెట్ హీరో సినిమాను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం ‘సలార్’ ను చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు. 


మల్టీఫ్లెక్స్ దగ్గర శ్రీయా, మిహీకా హగ్


తాజాగా హైదరాబాద్ లోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్ దగ్గర ‘సలార్’ బ్యూటీ శ్రీయా రెడ్డి, రానా దగ్గుబాటి భార్య మిహీకా దగ్గుబాటి కనిపించారు. ఈ సినిమాలో శ్రీయారెడ్డి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు సినిమా చూసేందుకు వచ్చారు. తొలుత శ్రీయారెడ్డి మిహీకా దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుతూ పలకరించుకున్నారు. శ్రీయా క్లాసిక్ వైట్ షర్ట్, స్ట్రెయిట్ బ్లూ బ్లాక్ టూ టోన్ జీన్స్ లో కనిపించింది. కళ్లకు కూల్ సన్ గ్లాసెస్‌ పెట్టుకుంది. లూజ్ హెయిర్ తో ఆకట్టుకుంది. రానా భార్య మిహీకా, స్లింగ్ బ్యాగ్‌తో పూర్తి నలుపు రంగు దుస్తుల్లో కనిపించింది. పైన లైట్ పింక్ స్వెటర్ వేసుకుంది. లూజ్ హెయిర్ తో అట్రాక్టివ్ గా కనిపించింది. కారు కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడ్డారు.   


శ్రీయారెడ్డి, మిహీకా దగ్గుబాటి వీడియో..






సలార్ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు


ఇప్పటికే ‘సలార్‘ మూవీకి హిట్ టాక్ రావడంతో సినీ ప్రముఖులు తమ రివ్యూ ఇస్తున్నారు. మూవీ అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు.  నటీనటులు, దర్శకుడితో పాటు టెక్నకల్ టీమ్ పైనా ఆయన అభినందనలు కురిపించారు. “డియర్ ‘దేవా’ సలార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. ‘సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కుడోస్. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు అద్భుతంగా నటించారు. మిగతా టెక్నీకల్ టీం అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని చిరు రాసుకొచ్చారు. మెగాస్టార్ నుంచి అద్భుతమైన రివ్యూ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.  


‘సలార్’ మూవీ గురించి..  


‘సలార్’ మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. టిన్ను ఆనంద్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, మైమ్ గోపి, జాన్ విజయ్ కీలక పాత్రలో నటించారు. 


Read Also: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..