Prema Entha Madhuram December: ఈరోజు ఎపిసోడ్ లో నాన్న అని చెప్పి ఆర్య దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుంటారు పిల్లలిద్దరు.
అను: అదేంటి పిల్లలు ఇద్దరు ఆర్య సార్ ని నాన్న అని పిలుస్తున్నారు? మా నాన్న వీళ్ళకి జరిగినదంతా చెప్పేసారా ఏంటి అని కంగారుపడుతుంది.
యాదగిరి: పిల్లలకి నిజం తెలిసిపోయిందా ఏంటి నాన్న అని పిలుస్తున్నారు అని అనుకుంటాడు.
ఉష: అదేంటి మా అన్నయ్యని మీరు నాన్న అని పిలుస్తున్నారు?
అభయ్: మేము మాల వేసుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా. మరి తండ్రి అనే పిలుపుకి మేము ఎప్పుడో దూరం అయిపోయాము.
అక్కి: నిన్ను చూసిన వెంటనే మా నాన్నలాగే అనిపించావు ఫ్రెండ్.. అందుకే నాన్న అని పిలిచాము అని అనగా ఆ మాటలకు ఆర్య ఎమోషనల్ అవుతాడు.
సుగుణ: ఇంతకీ ఏ కోరిక కోసం మీరు మాల వేసుకున్నారు?
అభయ్: మా నాన్న తిరిగి మా దగ్గరికి రావాలని మేము మాల వేసుకున్నాము
అక్కి: చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు దూరం అయిపోయాను. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ దగ్గర నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూసాను కానీ మాకు ఎప్పుడూ ఆ ప్రేమ దక్కలేదు. అమ్మని అడిగితే ఇంకా బాధపడుతుంది.. అందుకే నాన్న తిరిగి రావాలని మేమే మాల వేసుకున్నాము.
యాదగిరి: మరి మాల వేసుకుంటే ఉదయాన్నే లేచి, చల్లనీల్లతో స్నానం చేసి, ఉపవాసాలన్నీ ఉండాలి. మీరు చేయగలరా?
అభయ్: మా నాన్న మాకు దొరుకుతారంటే ఫుడ్ కూడా తినకుండా ఉండగలము.
ఆర్య: మీ నాన్న కచ్చితంగా మీ దగ్గరికి వస్తారు అని ధైర్యం ఇచ్చి ఎలాగైనా వీళ్ళ నాన్న వీళ్ళు దగ్గరకు రావాలి అని మనసులో అనుకుంటాడు. తర్వాత పిల్లలు ఇద్దరు అను దగ్గరికి వెళ్తారు. వెళ్లిన వెంటనే అను కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
అను: మాల వేస్తున్నారు అని నాకెందుకు చెప్పలేదు?
అక్కి: చెప్తే నువ్వు మళ్ళీ వద్దంటావమ్మా అందుకే నీకు చెప్పకుండా వేసేసుకున్నాము. నాన్న మాకు ఎలాగైనా కావాలి.
అభయ్: అందుకే ఈ మాల వేసాము ఈ మాల తీసే లోపు మా నాన్న మా దగ్గరికి రావాలని దీవించమ్మ.
అను: ఆర్య సారే మీ నాన్నని చెప్తే సార్ కి దూరంగా ఉండలేరు. అప్పుడు సార్ ప్రాణాలకు ప్రమాదం అని మనసులో అనుకుంటూ ఆ దేవుడు మనకు ఎప్పుడూ మంచే చేస్తాడు అని ఇద్దరినీ హత్తుకుంటుంది.
అక్కి: అంతేకానీ మా నాన్న ఎవరో మాత్రం చెప్పలేదు అని మనసులో అనుకుంటుంది.
అభయ్: మా నాన్న ఎవరో మాకు తెలిసారు ఇప్పటికి మాకు అది చాలు అని మనసులో అనుకుంటాడు అభయ్.
ఆ తర్వాత సీన్లో యాదగిరి, ఆర్యలు ఒక దగ్గర ఉంటారు.
యాదగిరి: ఆ పొలం గురించి ఏం చేస్తున్నారు సార్?
ఆర్య: రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే దానికి ఎక్కువ ప్రాఫిట్స్ రావడం లేదు. అ లాండ్ కి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది అందుకే నమ్మిన వాళ్ల చేత కన్స్ట్రక్షన్ చేసేటట్టు చూడాలి. అందుకే జెండేను పిలిపించాను అనే టైంలో జెండే ఒక కన్స్ట్రక్టర్ ని పట్టుకుని అక్కడికి వస్తాడు. వెంటనే యాదగిరి, జండే కొట్టిన దెబ్బలు తెచ్చుకుని ఉలుక్కి పడతాడు.
జెండే: నువ్వేంటి ఇక్కడ?
యాదగిరి: మీ దెబ్బలను ఇంకా మర్చిపోలేదు సార్, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను.
ఆర్య: జ్యోతి భర్త యాదగిరి.
ఆర్య: ఇక్కడికి నిన్ను ఎందుకు పిలిపించాను అంటే ఆ సైట్ కంస్ట్రక్షన్ కోసం ఒక నమ్మిన వ్యక్తి కావాలి అని అనగా పక్కన ఉన్న ఆ కంస్ట్రక్టర్ నన్ను నమ్మండి సార్, మీరు అనుకున్నట్లుగానే నేను కన్స్ట్రక్షన్ చేస్తాను అని అంటాడు. సరే అని చెప్పి ఆర్య అక్కడి నుంచి వాళ్లని పంపించేస్తాడు.
యాదగిరి: పిల్లల ముగ్గురు గురించి సరే మరి సూర్య భాగాన్ని ఏం చేస్తారు?
ఆర్య: అది వాల్ల అమ్మ పేరు మీద ఉంచుతాము. అప్పుడే తనకి కూడా కొంచెం భూమి తన పేరు మీద ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో నిజం తెలిసినా కూడా తప్పు మన మీద ఉండదు అని అంటాడు.
మరోవైపు సుగుణ అనుని తోడు తీసుకుని ఛాయాదేవి ఇంటికి వస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అను అడగగా జరిగిన విషయం అంతా చెప్తుంది సుగుణ.
అను: అయ్యో మీరు ఇంత పని ఎందుకు చేశారు? వాళ్ళు ఎలాంటి వాళ్లో మీకు తెలుసు కదా అయినా సరే డాక్యుమెంట్స్ వాళ్ల చేతిలో పెట్టేముందు మీ కొడుకుని అయినా ఒకసారి అడగొచ్చు కదా?
సుగుణ: అప్పుడున్న కంగారులో అలా చేసేసాను.. ఇప్పుడు వెళ్లి డబ్బులు అడుగుదాము అని తీసుకొని లోపలికి వెళుతుంది
ఛాయాదేవి: మీతో పాటు ఎవరినో తోడుగా తీసుకొచ్చినట్టు ఉన్నారు అని వాళ్ళని చూసిన వెంటనే అడుగుతుంది.
మాన్సీ: అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమైనా అప్పు కావాలా?
సుగుణ: ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాము.. దాని కోసమే వచ్చాము.
ఛాయాదేవి: ఏ డబ్బులు గురించి మీరు మాట్లాడుతున్నారు? నాకేం గుర్తు రావడం లేదే
అను: పిచ్చిపిచ్చిగా ఉందా అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వండి లేకపోతే డాక్యుమెంట్స్ అయినా ఇచ్చేయండి.
ఛాయాదేవి: మీరు మాకు డాకుమెంట్స్ ఇచ్చినట్టు నాకేం గుర్తులేదు. మీరు నిజంగా మాకే ఇచ్చారా? అంటే ముసలి వాళ్లు కదా మతిమరుపుతో మర్చిపోయి ఉంటారు
సుగుణ: దయచేసి మీరు అలా అనొద్దు.. ఆ ల్యాండ్ తోనే కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను.. అందుకే మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చాను. మా జీవితం ఆ డబ్బు మీద ఆధారపడి ఉంది.
అను: మీరు ఆగండి ఆంటీ. వీళ్ళని ఇలా అడగకూడదు మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తెలుసు మర్యాదగా డబ్బులు ఇవ్వండి అని ఛాయదేవిని అడుగుతుంది అను. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!