Salaar response prabhas fans targets Venu Swamy: 'సలార్' సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. రెబల్ స్టార్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. అభిమాన కథానాయకుడిని దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరు వాళ్ళకు ఎంతో బాగా నచ్చింది. బాక్సాఫీస్ బరిలో కూడా 'సలార్' వసూళ్ళ రికార్డులు క్రియేట్ చేస్తోంది. దాంతో అందరూ హ్యాపీ! ఈ తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు. 


వేణు స్వామి... నువ్ బయటకు రా!
'ఇప్పుడు వేణు స్వామి ముఖ చిత్రం ఎలా ఉందో చూడాలని ఉంది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి కారణం ఏమిటంటే... జీవితంలో ప్రభాస్ హిట్ కొట్టలేరని ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి వ్యాఖ్యానించారు. 'ప్రభాస్ పని అయిపొయింది. లైఫ్‌లో ఆయన హైట్స్ అయిపోయాయి. కెరీర్ కష్టమే. ప్రభాస్ హీరోగా సినిమాలు తీస్తున్న నిర్మాతలు జాతకాలు చూపించుకోవడం మంచిది. ఆయనకు హిట్ రాదు' అని వేణు స్వామి చెప్పారు.


Also Readసలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?






కట్ చేస్తే... 'సలార్' థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు విమర్శకుల నుంచి సూపర్ రేటింగ్స్ రాలేదు. కానీ, సినిమాలో ప్రభాస్ కటౌట్ వాళ్ళకు నచ్చింది. హీరోయిజం బావుందన్నారు. ఇంకేముంది? వసూళ్ళ సునామీ సిద్ధమైంది. దాంతో ప్రభాస్ హిట్ కొట్టలేదని చెప్పిన వేణు స్వామి ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆదుకోవడం మొదలు పెట్టారు. 'నువ్ బయటకు రా', 'జాతకాలు చెప్తావ్ రా జాతకాలు' అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.


Also Read: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!






తెలంగాణా రాష్ట్రంలో మూడోసారి కెసిఆర్ నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికారంలోకి వస్తుందని, కెసిఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గతంలో వేణు స్వామి చెప్పారు. ఆ మాటలు నిజం కాలేదని, ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఆయన జాతకం తప్పు అయ్యిందని కొందరు గుర్తు చేస్తున్నారు. మరి, ఈ విమర్శల పట్ల వేణు స్వామి ఏ విధంగా స్పందిస్తారో?


Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు










































గమనిక: సామజిక మాధ్యమాలలో కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పాఠకుల ముందుకు తీసుకు రావడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప... ఆయా వ్యక్తులు పేర్కొన్న భావాలకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఏబీపీ దేశం బాధ్యత వహించదు. దయచేసి గమనించగలరు.