Astrologer Venu Swamy sensational comments on Prabhas marriage: ప్రభాస్ ఓ ఇంటి వాడు అయితే చూడాలని, అమ్మాయితో ఏడు అడుగులు వేస్తే ఆశీర్వదించాలని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు... సగటు సామాన్య సినిమా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ వయసు 44 ఏళ్ళు. ఆయనకు పెళ్ళీడు వచ్చి చాలా ఏళ్ళైంది. ఇంకా పెళ్లి మాత్రం కాలేదు. అసలు ఆయనకు పెళ్లి యోగం లేదని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్... ఈ జన్మలో పెళ్లి కాదు!
ప్రభాస్ (Prabhas)కు ఈ జన్మలో పెళ్లి కాదని, ఆయనకు పెళ్లి యోగం లేదని ఈ మధ్య ఓ డిజిటల్ (యూట్యూబ్) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త వేణు స్వామి చెప్పారు. ప్రభాస్ పెళ్లి విషయంలో సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో రెబల్ స్టార్ అభిమానులు వేణు స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెలబ్రిటీలకు చెందిన వ్యక్తిగత జీవితాలు, జాతకాల గురించి చెబుతూ వేణు స్వామి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం పొందుతున్నారు. పబ్లిసిటీ కోసం తాను వాళ్ళ జాతకాలు చెబుతున్నానని, తాను చెప్పినవి వంద శాతం జరిగాయి కనుక జనాలు తనపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు.
అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని వేణు స్వామి గతంలో చెప్పిన మాటలు నిజం కావడంతో... ఆయన వ్యాఖ్యలకు ప్రేక్షకులలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ఏడు అడుగులు వేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కలిసి ఉండే అవకాశాలు లేవని వేణు స్వామి చెప్పారు. దాంతో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు... మెగా అభిమానులు సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాలు గురించి వేణు స్వామి ఏం చెప్పారో... ఈ కింద లింక్ క్లిక్ చేసి చదవండి.
Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
విజయాలకు దూరంగా ప్రభాస్ కెరీర్?
ప్రభాస్ పెళ్లి గురించి మాత్రమే కాదు... ఆయన కెరీర్ గురించి కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ సాఫీగా ముందుకు సాగడం కష్టం అన్నట్లు చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే... 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది కన్‌క్లూజన్' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు సరైన విజయాలు సాధించలేదు.
'సాహో' చిత్రానికి విమర్శకులు, మెజారిటీ ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. కానీ, ఉత్తరాదిలో కొందరు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. దాంతో అక్కడ వంద కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో 'సలార్' మీద ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. వేణు స్వామి వ్యాఖ్యలు ఆ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి.
Also Read: జెర్సీ నుంచి హాయ్ నాన్న వరకు... నాని లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!
తెలంగాణలో మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గతంలో చెప్పిన వేణు స్వామి, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మేజిక్ ఫిగర్ సాధించడంలో వెనుకంజ వేసిన తర్వాత మాట మార్చారని సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. కెసిఆర్ సీఎం అని వేణు స్వామి చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.