Jagadhatri Today Episode: నిషిక మీరెందుకు హోటల్ కి వచ్చారు అని పోలీస్ ని అడుగుతుంది.


ధాత్రి: టిఫిన్ చేయడానికి వచ్చారంట.


నిషిక: అనుమానంగా మీరు ఏ హోటల్ కి వచ్చారు అని అడుగుతుంది.


పోలీస్: మీరు ఏ హోటల్ కి వెళ్లారో నేను ఆ హోటల్ కి వచ్చాను కాబట్టే కిడ్నాప్ అయిన సంగతి తెలిసింది. అయినా పాప దొరికిన ఆనందం కన్నా ప్రశ్నలే ఎక్కువ అవుతున్నాయి పాప దొరకడం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు.


కౌషికి : పాప దొరికింది అదే చాలు ఇంక పదండి అని చెప్పడంతో అందరూ బయలుదేరుతారు.


యువరాజ్: మీరు ఈ టైంలో ఎక్కడికి వచ్చారు ఎలా వచ్చారు అని అడుగుతాడు.


ధాత్రి : ఫ్రెండ్ ని కలవడానికి క్యాబ్లో వచ్చాము అని చెప్తుంది.


సరే నేను డ్రాప్ చేస్తాను అని యువరాజ్ చెప్తాడు వెళ్తూ రౌడీల దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎవరు కొట్టారు అని అడుగుతాడు. నేను కొట్టాను నీకు ఏమైనా డౌటా అని పోలీస్ అడగటంతో ఏమి చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళ ముగ్గురు చుట్టూ ఏదో జరుగుతుంది అని మనసులో గట్టిగా అనుకుంటాడు.


ఆ తర్వాత నిషిక బట్టల షాపింగ్ చేసి ఇంటికి వస్తుంది.


కౌశికి : ఇప్పుడేంటి షాపింగ్.


నిషిక : రేపు ఫంక్షన్ ఉందన్నారు కదా అందుకే బట్టలు తీసుకువచ్చాను.


అప్పుడే కౌషికి ఫోన్ కి లక్ష పాతిక వేలు కట్ అయినట్టుగా నోటిఫికేషన్ వస్తుంది.


కౌషికి: యువరాజ్ నీ అకౌంటు నుంచి లక్ష పాతికవేలు కట్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది.


యువరాజ్: నేను ఖర్చు పెట్టలేదు మీ దగ్గరే ఉన్నాను కదా.


కౌషికి : నీ కార్డు ఎవరో కొట్టేసినట్లున్నారు నీ కార్డ్ సీజ్ చేయమని బ్యాంక్ వాళ్ళకి మెసేజ్ పెడతాను.


నిషిక : ఎందుకు అంత హడావుడి చేస్తున్నారు.. చెప్పాను కదా నేను షాపింగ్ చేశాను అని దానికి లక్షల పదివేలు అయింది.


కౌషికి : అంత ఖర్చు పెట్టి షాపింగ్ చేసావు.. పోనీ ఇంట్లో అందరికీ తెచ్చావా అంటే అది లేదు అంటుంది.


నిషిక: అందరికీ నేను ఎందుకు తెస్తాను ఎవరి వాటాలు వాళ్లకు ఉన్నాయి.. నా కుటుంబ సభ్యులకు మాత్రమే నేను తీసుకు వస్తాను అంటుంది.


కౌషికి : కోపంతో నిషి మీద చెయ్యి ఎత్తుతుంది.. ఈ కుటుంబాన్ని ఎప్పుడు విడదీసి మాట్లాడొద్దు ఇది ఉమ్మడి కుటుంబం అంటుంది.


అప్పుడే షాపింగ్ నుంచి వచ్చిన ధాత్రి దంపతులు ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకువస్తారు. అది చూసిన కౌషికి మన ఇంటి వాళ్ళు కాకపోయినా అందరికీ బట్టలు తీసుకువచ్చారు అది సంస్కారం అంటే చూసి నేర్చుకోమని నిషికని మందలిస్తుంది.


నిషిక: వాళ్లు మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి అలా చేస్తున్నారు లేకపోతే ఏ సంబంధం లేని వాళ్ళు ఎందుకు బట్టలు తీసుకువస్తారు.


కేదార్: ఎవరు చెప్పారు సంబంధం లేదని ఇది కూడా మా కుటుంబమే అనడంతో అందరూ షాక్ అవుతారు.


ధాత్రి : అదే మేము కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు కదా.. అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులే అంటూ బట్టలు అందరికీ ఇస్తుంది.


సుధాకర్: బట్టలు తీసుకోకుండా బయటి వాళ్లు ఇచ్చిన బట్టలు నేను వేసుకోను నాకు బట్టలు కొనడానికి నా కొడుకు ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


కౌషికి: నిషిని బట్టలు వెనక్కి ఇచ్చేసి ఇంట్లో అందరికీ బట్టలు తీసుకుని రా అని చెప్తుంది.


నిషిక: అది జరగని పని.. కావాలంటే ఆ డబ్బులు మా పుట్టింటి నుంచి తీసుకువస్తాను అని చెప్పి తల్లికి ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది.


ఆ తర్వాత డబ్బులు తీసుకువచ్చిన రాగిణితో గొడవ పెంచుకోవద్దు అని చెప్తుంది ధాత్రి. అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడం వల్లే దానికి ఈ కష్టాలు అని చివాట్లు పెడతారు రాగిణి, ఆమె వదిన. అది పొగరుగా మాట్లాడితే మధ్యలో దీనిని ఎందుకు అంటారు అని సుభద్రమ్మ ధాత్రిని వెనకేసుకొస్తుంది. తర్వాత రాగిణి కూతురు చేతిలో ₹1,50,000 పెడుతుంది.


నిషిక: లక్షాపాతిక వేలు కౌషికి ముందు పెట్టి మీ దగ్గర వాడుకున్న డబ్బు. వడ్డీ అని చెప్పి మరొక పాతికవేలు ఆమె ముందు ఉంచుతుంది.మీరు బిజినెస్ ఉమెన్ కదా అని అవమానించినట్లుగా మాట్లాడుతుంది.


కౌషికి : ఇంకోసారి ఇలా మాట్లాడితే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు డబ్బులు తీసుకువచ్చారు అని రాగిణిని మందలిస్తుంది.


ఆ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో రాగిణికి చెప్తుంది వైజయంతి.


రాగిణి: తప్పంతా నీదే, కౌషికికి క్షమాపణ చెప్పు అనటంతో షాక్ అవుతుంది నిషిక.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.