Venkatesh Saindhav Audience Review In Telugu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రువు విక్టరీ వెంకటేష్. ఆయన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ 'సైంధవ్'. హీరోగా ఆయన 75వ చిత్రమిది. ఇదొక మైల్ స్టోన్ సినిమా కావడంతో దగ్గుబాటి అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టు ప్రచార చిత్రాలు సైతం ఆకట్టుకున్నాయి.


సైకో మామగా వెంకీ మామ మాస్ & యాక్షన్ అవతార్, ఆ క్యారెక్టరైజేషన్ 'సైంధవ్'ను మరింత స్పెషల్‌గా మార్చాయి. 'హిట్', 'హిట్ 2' విజయాల తర్వాత శైలేష్ కొలను  దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీలో అమెరికాలో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉంది? ఎన్నారై ఆడియన్స్ సినిమా గురించి ట్విట్టర్‌లో ఏమంటున్నారు? అనేది చూస్తే... 


స్టైలిష్ యాక్షన్ డ్రామా 'సైంధవ్'...
యాక్షన్ సీక్వెన్సులు అదుర్స్! కానీ?
Saindhav first review: 'సైంధవ్' సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామా అని ఎన్నారై నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. వెంకటేష్ యాక్షన్ అవతార్ అదుర్స్ అని చెప్పారు. ఆ మాటలు అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో సైకో మామ అదరగొట్టేశారని ఎన్నారై ఆడియన్స్ చెప్పుకొచ్చారు. సినిమాలో వెంకటేష్ పేరు సైంధవ్ కోనేరు. షార్ట్ కట్‌లో సైకో. అదీ సంగతి! సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయట. కానీ, డ్రామా అంతగా పడలేదట. సినిమా ఫ్లాట్‌గా ఉందన్నారు.


సెకండాఫ్ ఫైట్స్ మామూలుగా లేవు... 
ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్
'సైంధవ్' ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ సూపర్ అని మెజారిటీ నెటిజనులు చెప్పే మాట. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్స్ మామూలుగా లేవట. ఎమోషనల్ సీన్లకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని ఆడియన్స్ చెబుతున్నారు. వెంకటేష్ వన్ మ్యాన్ షో సూపర్ అని, ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అంటే ఇలా ఉండాలని శైలేష్ కొలను మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also Read: 'సైంధవ్' ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఎంత? డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే...


సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మేజిక్ చేయలేదా?
'సైంధవ్' సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి', 'కాలా'తో పాటు పలు తమిళ హిట్స్, తెలుగులో న్యాచురల్ స్టార్ నాని 'దసరా'కు ఆయన పని చేశారు. సంతోష్ నారాయణన్ సంగీతానికి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, 'సైంధవ్'లో ఆయన మ్యూజిక్ మేజిక్ చేయలేదని నెటిజన్స్ చెబుతున్నారు. సినిమాకు అదే మైనస్ అంటున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ అయ్యుంటే సినిమా మరో రేంజ్ అంట!


Also Read: గుంటూరు కారం రివ్యూ: సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్... మహేష్ మాస్ రోల్, ఎనర్జీ సూపరైనా తేడా ఎక్కడ కొట్టిందంటే?



ఓవర్సీస్ రిపోర్ట్ చూస్తే... 'సైంధవ్'తో వెంకీ మామ హిట్టు అందుకుంటున్నట్టు అర్థం అవుతోంది. ట్విట్టర్‌ వేదికగా కొంతమంది వెలిబుచ్చిన అభిప్రాయాలను, 'సైంధవ్‌' ఆడియన్స్‌ టాక్‌ ఏమిటనేది చూడండి: