New SUVs in January 2024: 2024 జనవరిలో రానున్న వారాల్లో నాలుగు కొత్త కార్లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటిలో అనేక సూపర్ హిట్ కార్ల ఫేస్‌లిఫ్ట్‌లు, ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్
ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్ ఎస్‌యూవీ స్టైలింగ్, అధునాతన ఫీచర్లు, ఇంటీరియర్‌లో కొన్ని చిన్న మార్పులతో వస్తుంది. డీజిల్ మాన్యువల్ ఇంజన్ గేర్‌బాక్స్ కాంబినేషన్ ఈ మిడ్ లైఫ్ అప్‌డేట్‌తో తిరిగి అందుబాటులోకి రానుంది. అయితే ఇంజిన్ ఎంపికలు మారవు. 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కొత్త 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే, హెచ్‌వీఏసీ కంట్రోల్స్, డ్రైవ్, ట్రాక్షన్ మోడ్‌ల కోసం టోగుల్ స్విచ్‌లను పొందుతుంది. ఇది కాకుండా ఎక్స్‌టీరియర్‌గా కూడా అనేక బ్యూటీ ఛేంజెస్ చేశారు.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
త్వరలో ప్రారంభించనున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో 19 ఫంక్షన్‌లతో లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరాలు, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 115 బీహెచ్‌పీ, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో పాటు కొత్త 160 బీహెచ్‌పీ, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది.
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చారు. కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్ ప్రారంభమైంది. మ్యాక్స్ ట్రిమ్‌లో లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, రియర్‌వ్యూ కెమెరా, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రెండు ట్వీటర్‌లతో నాలుగు స్పీకర్లు, వాషర్‌తో పాటు వెనుక వైపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు లభిస్తాయి. ప్లస్ వేరియంట్‌లో 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుక రూఫ్ వెంట్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, మూడో వరుసలో రిమూవబుల్ సీట్లు ఫీచర్లు ఉంటాయి.
టాటా పంచ్ ఈవీ
ఇటీవలే టాటా పంచ్ ఈవీ అధికారిక చిత్రాల ద్వారా వెల్లడైంది. ఇది రాబోయే వారాల్లో అందుబాటులోకి రానుంది. ఇది టాటా లాంచ్ చేయనున్న నాలుగో ఎలక్ట్రిక్ కారు. ఇది బ్రాండ్ కొత్త ఈవీ డెడికేటెడ్ అవుట్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రూ.21,000 చెల్లించి దీన్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ కారు జెన్ 2 ఈవీ/యాక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్‌లో ఫ్రంట్ ట్రంక్, ఫ్రంట్ ఛార్జింగ్ సాకెట్‌తో బిల్డ్ అయిన మొదటి టాటా మోడల్. పంచ్ ఈవీ మైక్రో ఎస్‌యూవీ రెండు వేరియంట్‌లలో వస్తుంది. అవే స్టాండర్డ్, లాంగ్ రేంజ్. ఇది 25 కేడబ్ల్యూహెచ్, 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఇది ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!