సెలెక్టెడ్ మూవీస్ తో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి లేటెస్ట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో వచ్చింది. ఈ నెల 24 న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమా షూటింగ్ టైమ్ లో ఓలెక్క..రిలీజైన తర్వాత మరో లెక్క అన్నట్టు... షూటింగ్ పూర్తయ్యే వరకూ నటనపై కాన్సన్ ట్రేట్ చేసి..విడుదల తర్వాత ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రివ్యూలు, థియేటర్ల దగ్గర సందడి చూసి హమ్మయ్య అనుకుంటారు. అయితే కొంచెం కొత్తగా ఆలోచించే సాయిపల్లవి మాత్రం పేపర్లు, యూ ట్యూబ్ లో సందడి చూడడం కాదు ప్రేక్షకుల రియాక్షన్ డైరెక్ట్ గా చూడాలనుకుంది. ఇంకేముంది డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తో కలసి ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ల ఆనందాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బైంది.
పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ సొంతం చేసుకున్న సాయిపల్లవి `శ్యామ్ సింగ రాయ్`లో దేవదాసీ పాత్రలో నటించింది. రోసీగా ఆమె నటనకు ఫిదా కాని ప్రేక్షకులు లేరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల మధ్య మూవీని ఎంజాయ్ చేయాలనుకున్న సాయిపల్లవి సాధారణ ప్రేక్షకురాలిలా హైదరాబాద్ లో శ్రీరాములు థియేటర్ కు వెళ్లింది. బ్లాక్ బురఖా వేసుకుని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా `ప్రణవాలయ .. అంటూ మహిశాసుర మర్థినిగా సాయి పల్లవి త్రిశూలం ధరించి చేసే సాంగ్ కి వచ్చిన స్పందన చూసి ఆమె ఆనందానికి అవధుల్లేవట.
సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులతో పాటూ కలసి బయటకు రావడం, కారు దగ్గరకు వచ్చాక బురఖా తీసేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్న వీడియో షేర్ చేశారు మేకర్స్. సాయి పల్లవి ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు. రోసీగా సాయి పల్లవి ఆకట్టుకుంది. కృతిశెట్టి మరో హీరోయిన్. మడోన్నా సెబాస్టియన్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి