'ఆర్ఆర్ఆర్' (RRR For Oscars) అభిమానులకు ఇండియన్ ఆస్కార్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో పురస్కారం అందుకునే అర్హత, ఆస్కారం 'ఆర్ఆర్ఆర్'కు ఉన్నాయని ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు చాలా మంది భావించారు. అనురాగ్ కశ్యప్ వంటి హిందీ సినిమా దర్శకులు సైతం దర్శక ధీరుడు రాజమౌళి తీసిన సినిమాను పంపించాలని కోరుకున్నారు. అయితే... ఆ కోరికలకు భిన్నంగా 'ఛెల్లో షో' (Chhello Show - లాస్ట్ ఫిల్మ్ షో) ను పంపించారు. దీంతో 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ అందుకునే అవకాశం ముగిసినట్లు కాదు. దారులు మూసుకుపోయినట్టు కూడా కాదు. ఇంకా అవకాశం ఉంది. దాని కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ పెద్ద యుద్ధం చేయడానికి రెడీ అవుతోంది.


రంగంలోకి దిగిన అమెరికా డిస్ట్రిబ్యూటర్!
'ఆర్ఆర్ఆర్' అభిమానులకు శుభవార్త ఏంటంటే... సినిమా అమెరికా డిస్ట్రిబ్యూటర్ తమ సినిమాను అన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలో పదివేల మంది సభ్యులకు పిలుపు ఇస్తున్నారు. క్యాంపెయిన్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు.


ఉత్తమ సినిమా, దర్శకుడు, స్క్రీన్ ప్లే, నటుడు, సహాయ నటీనటులు, ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, సౌండ్, విజువల్స్ ఎఫెక్ట్స్ విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్'ను స‌బ్‌మిట్‌ చేయనున్నట్లు అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ 'వెరైటీ' మీడియా సంస్థకు తెలిపారు. 


'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. హీరోలు ఇద్దరినీ ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఆయన స్క్రీన్ ప్లే రాశారు. అందువల్ల, ఆ విభాగంలో వాళ్ళిద్దరూ నామినేట్ అవుతారు.
 
ఆస్కార్స్ రూమ్‌కు... అకాడమీ స్ట్రీమింగ్ రూమ్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇంకా అందుబాటులో లేదు. థియేటర్లలో ఆ సినిమాను చూస్తే దాని విజువల్ గ్రాండియర్, స్టోరీ డెప్త్ తెలుస్తుందని... ఎక్కువ మంది ఓటర్లు సినిమాకు థియేటర్లలో సినిమాను చూపించడం కోసం అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రయత్నిస్తున్నారు.


Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు!


అమెరికా డిస్ట్రిబ్యూటర్ రంగంలో దిగడంతో తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అవార్డుల బరిలో అసలైన యుద్ధం ముందుంది. ఆల్రెడీ హాలీవుడ్ దర్శకులు, రచయితలు సినిమా అద్భుతంగా ఉందని ట్వీట్లు చేయడంతో... అకాడమీలో మెజారిటీ సభ్యులు ఓట్లు వేస్తే నామినేషన్స్ లభించవచ్చు.  
    
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన!
'ఆర్ఆర్ఆర్'ను ఆస్కార్స్‌కు పంపించలేదని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. సినిమా అభిమానులు చాలా మందికి ఆ నిర్ణయం షాక్ ఇచ్చింది. ఎవరికీ తెలియని సినిమాను పంపిస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా! అయితే... 'ఆర్ఆర్ఆర్' సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడంపై స్పందించలేదు. ముందు నుంచి రాజమౌళి ఏమీ మాట్లాడలేదు. విదేశీ ప్రేక్షకుల నుంచి సినిమాకు వస్తున్న స్పందన తమకు సంతోషం కలిగించిందని మాత్రమే ఆయన చెబుతూ ఉన్నారు. 



Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?