RRR Oscar : ధియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అావార్డుల బరిలో మంచి ఫలితాలు వస్తాయని ్షల్ మీడియాలో కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియాలోనే అసలైన అడ్డంకిని ట్రిపుల్ ఆర్ అధిగమించలేకపోయింది. ఇండియా తరపున అధికారిక ఆస్కార్ ఎంట్రీగా గుజరాతీ సినిమా " చెల్లో షో "ను ఎంపిక చేశారు. చెల్లో షో అంటే " ఆఖరాట " అని అర్థం. ఓ చిన్న పిల్లవాడు సినిమాలపై ఇష్టంతో ఆపరేటర్‌కు లంచం ఇచ్చి ప్రొజెక్టర్ రూమ్‌లో సినిమాలు చూస్తూ.. తన కలల్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది సినిమా కథ. దీన్ని ఆస్కార్‌కు పంపాలని కమిటీ నిర్ణయించుకుంది.
ట్రిపుల్ ఆర్ ఇంటర్నేషనల్ మూవీ
ట్రిపుల్ ఆర్ సినిమా భారత్ తరపున అధికారిక ఎంట్రీ అయితే .. ఉత్తమ విదేశీ కేటగిరి చిత్రంలో పోటీ పడేది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. కానీ విడిగా ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడవచ్చు. ఇండియా తరపున అధికారిక ఎంట్రీ లేకపోయినా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ రేసు నుంచి వైదొలిగినట్లుగా కాదు. 2022 లో విడుదలైన చిత్రాలు జనరల్ ఎంట్రీ కేటగిరీస్ లో నామినేషన్ కోసం అప్లై చేయడానికి నవంబర్ 15 ఆఖరు తేదీ . ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీ కాకపోయినా అకాడమీ నియమనిబంధనల ప్రకారం ఈ యేడాది లాస్ ఏంజెల్స్ లో ఒక వారం ప్రదర్శితమైన చిత్రాలు, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కలిగి ఉంటే చాలు. వాటి ద్వారా పలు కేటగిరీల్లో నామినేషన్స్ కోసం ప్రయత్నించవచ్చు. అకాడమీ అవార్డులు దేశాలకు సంబంధించినవి కావు. ఇంగ్లిష్‌లో విడుదలైన లేదా ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో సినిమాలన్నీ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నామినేషన్ సంపాదించడం కీలకం - చురుకుగా ప్రమోట్ చేసుకుంటున్న ఆర్ఆర్ఆర్
ఒకవేళ నామినేషన్ వస్తే, ఆ తరువాత ఉంది అసలు కథ. మన దేశం నుండి ఇప్పటి దాకా అధికారికంగా ఎంట్రీ సంపాదించిన “మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్” చిత్రాలు నామినేషన్స్ తోనే సంతృప్తి చెందవలసి వచ్చింది. ఎందుకంటే నామినేషన్ పొందిన తరువాత ఆస్కార్ అవార్డుల ఎంపిక చేసే విధానానికి అనువుగా మనం నామినేషన్ సంపాదించిన కేటగిరీల్లో ఓట్లు పోయేగడానికి తగిన కృషి చేయాలి. అకాడమీలో దాదాపు పదివేల మంది సభ్యులుంటారు. వీరిలో కనీసం 9,500 మంది ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరు అందరికీ వివిధ విభాగాల్లో ఓట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో విభాగంలో విజేతను నిర్ణయించే ఓటు హక్కు మాత్రమే ఉంటుది.
అఫీషియల్ ఎంట్రీ కాకపోయినా వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న ట్రిపుల్ ఆర్
ఈ సారి డిసెంబర్ 12 నుండి 15 వరకు ప్రిలిమనరీ ఓటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 21న ఆస్కార్ షార్ట్ లిస్ట్స్ ప్రకటిస్తారు. 2023 జనవరి 12 నుండి నామినేషన్స్ ఓటింగ్ మొదలవుతుంది. ఈ ఓటింగ్ జనవర 17న ముగుస్తుంది. 2023 జనవరి 24న నామినేషన్స్ ను ప్రకటిస్తారు. 2023 మార్చి 2 నుండి 7 వరకు ఫైనల్ ఓటింగ్ సాగుతుంది 2023 మార్చి 12న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలెవరో తేలుతుంది. కమర్షియల్‌గా హిట్ అయిన.. మంచి సెన్సిబుల్ సినిమాలకూ పెద్ద ఎత్తున ఆస్కార్ అవార్డులు లభిస్తున్నాయి. ఈ కోణంలో ఆర్ఆర్ఆర్ కు ... టెక్నిషియన్స్‌కు నటులకూ మంచి చాన్సులున్నాయని అనుకుంటున్నారు.
ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా కాకపోయినా.. ట్రిపుల్ ఆర్ అంతర్జాతీయ సినిమాగా.. ఆస్కార్ బరిలో నిలవడం ఖాయం. అవార్డులు వస్తాయా లేదా అన్న సంగతి తర్వాత. కానీ ఆస్కార్ బరి నుంచి ట్రిపుల్ ఆర్ వెనక్కి తగ్గలేదు. బరిలోనే ఉంది. చెల్లో షోతో కలిసి భారత్ తరపున ఆస్కార్ అవార్డుల వేట సాగించనుంది.