Mahesh Babu : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పెట్టారు చూడండి

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త ఫోన్ కొన్నారండోయ్. ఆయన ఫోనులో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. మహేష్ నయా సెల్ఫీ చూశారా మీరు?

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా షూటింగులో బిజీ బిజీగా ఉన్నారు. అంతేనా? అంటే... కానే కాదు! షూట్ గ్యాప్‌లో ఫోటోలు కూడా దిగుతున్నారు. ఫోటోలు అంటే ఫోటోషూట్స్ కాదండీ... సెల్ఫీలు!

Continues below advertisement

అవును... మహేష్ బాబు సెల్ఫీ (Mahesh Babu Selfie) అంటే కాస్త కొత్త ఉంది కదూ! ఎందుకంటే? తనకు తానుగా సూపర్ స్టార్ సెల్ఫీ తీసుకోవడం అరుదు. సినిమా సెట్స్‌లో అయినా సరే... ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వేసిన సరే... ఎవరో ఒకరు మహేష్ ఫోటోలు తీస్తుంటారు. బట్, ఫర్ ఏ చేంజ్... మహేష్ సెల్ఫీ తీసుకున్నారు. ఎందుకంటే? ఆయన కొత్త ఫోన్ కొన్నారు. సెల్ఫీ తీసుకుని ''రెస్ట్ అండ్ రీచార్జ్! చిల్ నూన్స్'' అని పేర్కొన్నారు.  

మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?
మహేష్ బాబు ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్ (Mahesh Babu busy iphone 14 pro max) తీసుకున్నట్లు ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చుస్తే తెలుస్తోంది. ఆ ఫోనులో ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఇంతకీ, దాని రేటు ఎంతో తెలుసా? మన దేశంలో అయితే స్టార్టింగ్ 1,39,990 రూపాయలు. ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్ సిరీస్‌లో 128 జీబీ నుంచి 1 టీబీ వరకు వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. 

త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ సినిమా షూటింగ్‌కు వస్తే...
'అతడు', 'ఖలేజా' తర్వాత... 12 ఏళ్ళ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బస్‌ల‌తో భారీ ఫైట్స్ తీస్తున్నారు. మహేష్ డేర్ డెవిల్ స్టంట్స్ ఘట్టమనేని అభిమానులు, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇస్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
 
మహేష్ నయా లుక్...
వైరల్ హోగయా బాస్!
త్రివిక్రమ్ సినిమా కంటే ముందు... సినిమాలో మహేష్ లుక్ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన తొలి సినిమా 'అతడు'. ఆ తర్వాత 'ఖలేజా' చేశారు. 'అతడు' కల్ట్ క్లాసిక్ కాగా... 'ఖలేజా' మహేశ్‌కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ రెండు సినిమాల్లో మహేష్ లుక్స్ అప్పటి వరకు చేసిన సినిమాలకు డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ SSMB 28లో లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది.

Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు !

పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.

Also Read : ‘సీతారామం’ చూసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్ అగ్ని హోత్రి - ఆసక్తికర కామెంట్స్!

Continues below advertisement
Sponsored Links by Taboola