Nikhil Siddhartha on RRR: 


ప్రపంచంతా మెచ్చుకుంది: నిఖిల్ 


ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీనిచ్చింది "ఛెల్లో షో" (Chellow Show) మూవీ. కానీ..మూవీ లవర్స్ మాత్రం దీనిపై చాలా అసహనంతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న RRR సినిమాను కాదని..అప్పటి వరకూ పేరు కూడా వినబడని సినిమాను పంపడంపై గుర్రుమంటున్నారు. సోషల్ మీడియాలో అయితే...పెద్ద యుద్ధమే నడుస్తోంది. రాంగ్‌ రూట్‌లో చెల్లో షోని ఆస్కార్‌కు పంపారన్న వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. అటు ఇండస్ట్రీలోని పెద్దలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ యాక్టర్ నిఖిల్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.


ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నిఖిల్. "ఇలా అంటున్నందుకు సారీ. ఈ విషయంలో నా ఒపీనియన్ వేరు. అందరికీ ఆస్కార్ అవార్డ్స్ అంటే ఇష్టమే. కానీ...మన సినిమాను ప్రపంచమంతా మెచ్చుకుంది. అభిమానించింది. అదే సినిమాకు అతి పెద్ద అవార్డ్" అని అన్నాడు ఈ కార్తికేయ ఫేమ్ యాక్టర్. "RRRపై సినిమా అభిమానులు ప్రేమ కురిపించారు. అదే ఆ సినిమా సాధించిన పెద్ద విజయం. అలాంటప్పుడు మనకు ఆస్కార్స్ ఎందుకు? మనకంటూ ప్రత్యేకంగా ఫిల్మ్‌ఫేర్, నేషనల్ అవార్డ్స్ లాంటివి ఉన్నాయి. నేను పర్సనల్‌గా ఆస్కార్స్‌కు ప్రాధాన్యతనివ్వను. అసలు ఆస్కార్స్‌ నుంచి మనకు సర్టిఫికేట్ అవసరమా? మన సినిమాలు అద్భుతం. ఇండియా సినిమాలు అదరగొడుతున్నాయి. స్పెయిన్‌లో ఉన్నప్పుడు నేను RRR సినిమా చూశాను. థియేటర్ ఫుల్ అయిపోయింది. స్పానిష్ వాళ్లంతా ఆ సినిమాను చూసి మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చారు. మనకు ఆస్కార్స్ నుంచి స్పెషల్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు" అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మధ్యే కార్తికేయ-2తో హిట్ కొట్టాడు నిఖిల్. బాలీవుడ్‌లోనూ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కృష్ణుడి కాన్సెప్ట్ ఉండటం వల్ల నార్త్‌ వాళ్లూ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమిర్ ఖాన్ లాల్‌ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్‌కు పోటీ ఇచ్చి నిలబడింది కార్తికేయ-2. త్వరలోనే కార్తికేయ-3 షూట్ కూడా స్టార్ట్ చేస్తారట. అయితే...ఈ సీక్వెల్‌ని 3Dలో తీయాలని చూస్తున్నారు. 


RRR టీం ప్రయత్నాలు 


'ఆర్ఆర్ఆర్' అభిమానులకు శుభవార్త ఏంటంటే... సినిమా అమెరికా డిస్ట్రిబ్యూటర్ తమ సినిమాను అన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలో పదివేల మంది సభ్యులకు పిలుపు ఇస్తున్నారు. క్యాంపెయిన్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఉత్తమ సినిమా, దర్శకుడు, స్క్రీన్ ప్లే, నటుడు, సహాయ నటీనటులు, ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, సౌండ్, విజువల్స్ ఎఫెక్ట్స్ విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్'ను స‌బ్‌మిట్‌ చేయనున్నట్లు అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ 'వెరైటీ' మీడియా సంస్థకు తెలిపారు. 'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. హీరోలు ఇద్దరినీ ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఆయన స్క్రీన్ ప్లే రాశారు. అందువల్ల, ఆ విభాగంలో వాళ్ళిద్దరూ నామినేట్ అవుతారు.


Also Read: National Cinema Day: సినీ లవర్స్ కు నాగార్జున గుడ్ న్యూస్, రూ.75కే సినిమా చూసే ఛాన్స్