హిందీ సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్స్‌కు రోహిత్ శెట్టి ఫేమస్. ఆయన తీసిన 'గోల్ మాల్', 'సింగం' సిరీస్‌లు బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్ళు సాధించాయి. అయితే... రీసెంట్ రిలీజ్, రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన 'సర్కస్' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ రిజల్ట్ పక్కన పెట్టి... ఆల్రెడీ 'సర్కస్' విడుదలకు ముందు స్టార్ట్ చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నారు. 


కార్ ఛేజ్ తీస్తుండగా...
సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' పేరుతో రోహిత్ శెట్టి ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో చిత్రీకరణ చేస్తున్నారు. యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్న సమయంలో రోహిత్ శెట్టికి గాయాలు అయినట్టు తెలిసింది. 


కార్ ఛేజ్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో గాయాలు కాగా... రోహిత్ శెట్టిని యూనిట్ సభ్యులు హుటాహుటిన ఎల్.బి. నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది. ఆయనకు చిన్న గాయమే అయ్యిందని, డాక్టర్లు సర్జరీ చేశారని సమాచారం అందింది. ఆల్రెడీ రోహిత్ శెట్టిని డిశ్చార్జ్ చేశారు. 


స్వయంగా స్టంట్స్ చేసే రోహిత్ శెట్టి
రోహిత్ శెట్టికి స్టంట్స్ సీన్స్ సొంతంగా చేయడం అలవాటు. ఆయన దర్శకుడు కాక ముందు స్టంట్‌మాన్‌గా చేశారు. ఆయన తండ్రి ఎం.బి. శెట్టి కూడా స్టంట్‌మాన్‌, ఫిల్మ్ యాక్షన్ కొరియోగ్రాఫర్. కొన్ని సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేయడమే కాదు... విలన్ రోల్స్ కూడా చేశారు. తండ్రి వారసత్వాన్ని అందుకున్న రోహిత్ శెట్టి... దర్శకుడు అవ్వక ముందు ఓ సినిమాలో అక్షయ్ కుమార్ బాడీ డబుల్ గా చేశారు.
 
'చెన్నై ఎక్స్‌ప్రెస్' సెట్‌లో రోహిత్ శెట్టి తలపై దీపికా పదుకోన్ సోడా బాటిల్ తీసుకుని కొట్టిన మేకింగ్ వీడియో వైరల్ అయ్యింది. స్వయంగా కార్స్ డ్రైవ్ చేస్తూ యాక్షన్ సీక్వెన్సుల్లో పార్టిసిపేట్ చేయడం రోహిత్ శెట్టికి అలవాటే.  


రోహిత్ శెట్టి దర్శకత్వం వహించే సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు హిందీ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులతో పోలిస్తే కాస్త వైవిధ్యంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఎక్కువ కనబడుతుంది. అందువల్ల, మాస్ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుంది. రివ్యూలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు వందల కోట్ల వసూళ్ళు వస్తుంటాయి. కానీ, ఈసారి 'సర్కస్' ఆ ఫీట్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. 


Also Read : బాలకృష్ణ సేఫ్ - ఒంగోలులో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏమైందంటే? 


తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... నాలుగు భాషల్లో తీసిన సినిమాలు ఓ వైపు హిందీలో విజయాలు సాధిస్తుంటే? బాలీవుడ్ దర్శక నిర్మాతలు తీసే సినిమాలు ఫ్లాప్ కావడం పట్ల ఒకానొక సందర్భంలో రోహిత్ శెట్టి స్పందించారు. హిందీ చిత్రసీమకు మద్దతుగా ఆయన మాట్లాడారు. హిందీలో 'షోలే', 'కుచ్ కుచ్ హోతా హై', 'గోల్ మాల్', 'సూర్యవన్షీ' వంటి సినిమాలు వచ్చాయని, ఫ్లాప్ పీరియడ్ ఒక దశ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. 


సౌత్ సినిమాలు చూసి ఫ్రీమేక్ చేసే రోహిత్ శెట్టి ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం కామెడీగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 'సర్కస్' సినిమా విడుదలకు ముందు ఆయన చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ట్రోల్స్ మరింత ఎక్కువ అయ్యాయి. 




Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?