గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన సేఫ్‌గా ఉన్నారు. పైలట్ సకాలంలో సమస్యను గుర్తించడంతో అంతా సురక్షితంగా ఉంది. అసలు, ఏమైంది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 



బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie). శుక్రవారం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అక్కడికి బాలయ్య హెలికాఫ్టర్‌లో మాస్ ఎంట్రీ ఇచ్చారు. శనివారం ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. అయితే... గాలిలోకి వెళ్ళిన కాసేపటికి హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం ఉన్నట్టు పైలట్ గుర్తించారు. దాంతో మళ్ళీ ఒంగోలులో హెలికాఫ్టర్‌ ల్యాండ్ చేశారు.
 
రోడ్డు మార్గంలో వస్తారా?
వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా గాల్లోకి ఎగిరిన హెలికాఫ్టర్ 20 నిమిషాల తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ఒంగోలులో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న హెలికాఫ్టర్‌ ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే... ఇప్పుడు మళ్ళీ హెలికాఫ్టర్ ప్రయాణం చేయడం సురక్షితమేనా? లేదంటే బాలకృష్ణను రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకు వస్తారా? అనేది చూడాలి.



Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?  



Veera Simha Reddy Pre Release Event : ఒంగోలులో 'వీర సింహా రెడ్డి' చిత్ర బృందానికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా బాలకృష్ణకు! ఆయన్ను చూడటం కోసం అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. హెలికాఫ్టర్ దిగిన ఆయనకు చాలా మంది శాలువాలు కప్పి సత్కరించారు. రాయలసీమతో బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది. సీమ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. మరీ ముఖ్యంగా 'సింహా' టైటిల్ ఉన్న సినిమాలు. ఇప్పుడీ 'వీర సింహా రెడ్డి' కూడా సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాల జాబితాలో చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 


Also Read : అమెరికాలో నందమూరి, మెగా ఫ్యాన్స్ గొడవ పడొద్దు - డల్లాస్ ఘటనపై నిర్మాత రవిశంకర్


ఆల్రెడీ 'వీర సింహా రెడ్డి' అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అమెరికాలో ప్రీ సేల్స్ సూపర్ ఉన్నాయి. ఇంతకు ముందు బాలకృష్ణ రికార్డులు చెరిపేయడం ఖాయంగా కనబడుతోంది. ఒక్కో షో ఫుల్ అవుతూ ఉండటంతో స్క్రీన్లు యాడ్ చేస్తూ వెళుతున్నారు. సినిమా విడుదల దగ్గర పడే సమయానికి మరిన్ని షోలు పడే అవకాశం ఉంది. ఫస్ట్ డే వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క అమెరికా నుంచి మొదటి రోజు, అంతకు ముందు ప్రీమియర్ షో కలుపుకొంటే ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.