గుప్పెడంతమనసు జనవరి 7 శనివారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 7th Update)


వసుధార మాటలు తలుచుకుని రిషి కన్నీళ్లు పెట్టుకుంటాడు... మీ ప్రేమ కావాలి ఐ లవ్ యూ అన్న మాట నుంచి ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నంతవరకూ జరిగినదంతా తలుచకుని బాధపడతాడు. రిషి లేకుండా వసు పూర్తవదు..నా ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు..ఈ చేతలు నాకు ధైర్యం అని చెప్పినవి అన్నీ గుర్తుచేసుకుంటాడ..అటు వసుధార కూడా అదే పరిస్థితిలో ఉంటుంది.. 
రిషి: వసుధారా నన్ను ఏం చేద్దాం అనుకంటున్నావ్.. బంధం అనుకుంటే భ్రమ అయ్యావా...నువ్వు ఏం అడిగినా చెప్పవు.. నువ్వు వెళ్లిపొమ్మంటే నేనువెళ్లిపోతానా.. రిషిధారలోంచి రిషి విడిపోడు..ధారను విడిపోనివ్వడు.. అనుకుంటూ లేస్తాడు... ఇంతలో ఆర్డర్ ప్లీజ్ అని బేరర్ వచ్చి అడగడంతో..ఏమీ వద్దు అని చెప్పి డబ్బులిచ్చి వెళ్లిపోతాడు...


Also Read: ముగ్గురి భామల మధ్య డాక్టర్ బాబు- చారుశీలను వణికించిన మోనిత, శపథం చేసిన దీప


మరోవైపు వసుధార తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటారు.. బయట ఉన్న సెక్యూరిటీ కాఫీ తాగేందుకు వెళతారు..అప్పడు ఎంట్రీ ఇస్తాడు రాజీవ్.. ఇద్దర్నీ  హాస్పిటల్ బెడ్ పై చూసి ఏదేదో మాట్లాడతాడు.. రాజీవ్: మీలాంటి మావయ్యగారు ఉన్నంతవరకూ నాకు ఎలాంటి సమస్యాలేదు..కానీ అత్తయ్యగారే ప్లాబ్లెమ్ అంటూ..సుమిత్ర దగ్గరకు వెళ్లి మీ త్యాగమే నా పెళ్లికి ఉపయోగపడుతుంది.. మీరు త్యాగం చేయండి..మీరు చస్తారనుకుంటే చావలేదు..రేపోమాపో లేచి కూర్చుంటారు తర్వాత జరిగింది మొత్తం మావయ్యగారితో చెప్పేస్తారు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి..మిమ్మల్ని పొడిచింది నేనే అని అందరికీ తెలిస్తే నా క్యారెక్టర్ ఏమైపోతుంది...మీరు బతికి నన్ను జైలుకి పంపిస్తారా..మీరు చనిపోయి నా పెళ్లి జరిపిస్తారా ఆలోచించుకోండి.. మీరు బతకడం అవసరమా...మీరు బతికినా నాకు సపోర్ట్ చేయరు..పుణ్యస్త్రీగా వెళ్లిపోయే వరాన్ని మీకు ప్రసాదిస్తాను అంటూ ఆక్సిజన్ తీసేస్తాడు.. ఇవే మీకు చివరి ఘడియలు అనేసి వెళ్లిపోతుంటాడు..అప్పుడే కళ్లు తెరిచిన చక్రపాణి...అల్లుడు రాజీవ్ బయటకు వెళ్లడం చూస్తాడు..అదే సమయానికి హాస్పిటల్లో ఎంట్రీ ఇచ్చిన రిషి..పరుగున వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడతాడు...రిషిని చూస్తాడు చక్రపాణి. 
ఆక్సిజన్ మాస్క్ పెట్టలేదు ఎందుకు...పేషెంట్ ని సరిగా చూసుకోరా అని అంటాడు.. వీళ్లకి ఎవ్వరూ లేరనుకోవద్దు.. నేనున్నాడు ట్రీట్మెంట్ ఇవ్వండని చెబుతాడు రిషి.. 
బయట నుంచి అప్పుడే వచ్చిన రాజీవ్..నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు
రిషి: వీళ్లను చూసుకునే బాధ్యత నాకుంది..
రాజీవ్: నీ కారణంగానే వసుధార జైలుకి వెళ్లింది..వీళ్లిద్దర్నీ హాస్పిటల్ కి తీసుకొచ్చి రక్షించింది నేను..నువ్వు ఇక్కడి నుంచి బయటకుపో..
రిషి: నువ్వేంటో నీ ఆలోచనలేంటో నాకు తెలుసు..ఇది హాస్పిటల్ కాబట్టి సైలెంట్ గా ఉన్నాను..డాక్టర్ గారు ఇద్దర్నీ చూసుకునేందుకు ప్రత్యేకంగా నర్సులను పెట్టండి.
రాజీవ్: ఇతన్ని మా మావయ్యగారు చూస్తే చచ్చిపోతారు..ఇతన్ని బయటక పంపించండి..
రిషి: తను చెప్పేదంతా నిజం కాదు..
హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్ల ముందు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు..వెళ్లిపోండి అంటాడు డాక్టర్...ఇద్దరికీ మంచి ట్రీట్మంట్ ఇవ్వండని చెప్పి రిషి వెళ్లిపోతాడు...


Also Read: త్వరలో కలుద్దాం - చిటికెలు వేసి మరీ దేవయానికి వసు వార్నింగ్, తాళిపై రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి!


జగతి మహేంద్ర...హోటల్ రూమ్ లో కూర్చుని బాధపడుతుంటారు...మహేంద్ర నువ్వు కూడా ఇలాఉంటే రిషికి ధైర్యం ఎవరు చెబుతారని సముదాయిస్తుంది జగతి. చిన్నప్పుడు నేను దూరమైతే తట్టుకున్నాడు దానికి నీ ప్రేమ కారణం.. నువ్వు ధైర్యంగా ఉండాలి..నువ్వే ఇలా అయితే ఎలా మహేంద్ర...
మహేంద్ర: రిషి జీవితంలోకి వసు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది.. చిన్నప్పటి బాధ మరిచిపోయాడు, సాక్షి మోసం మర్చిపోయాడు..మళ్లీ ఒంటరివాడవుతాడు
జగతి: రిషి తప్పకుండా దీన్ని తట్టుకంటాడు..రిషి గెలుస్తాడు మహేంద్ర...
మహేంద్ర: రిషి కోలుకోలేడు..నాకు భయం వేస్తోంది జగతి..రిషి ఇంటికివెళ్లి ఉంటాడా.. ఇక్కడ మనం ఉండికూడా ఏం చేయగలం..మనం వెళదాం జగతి..బాధ కలిగితే రిషిని ఓదార్చేది మన కాలేజీ ఒక్కటే..


మరోవైపు రిషి... ఓ దగ్గర నిల్చుని ఆలోచిస్తాడు.. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా..ఎన్ని కబుర్లు చెప్పావ్, ఎన్నో అందమైన మాటలు చెప్పావ్..కొత్త జీవితాన్ని చూపించి ఇప్పుడు వెళ్లిపోమంటున్నావ్.. నా జీవితంలోకి రావడం వెళ్లడం అంతా నీ ఇష్టమేనా..నువ్వు నన్ను మోసం చేశావా..రిషి ధారలోంచి రిషిని వదిలేశావా అని  బాధపడతాడు... అటు జైల్లో కూడా వసుధార రిషిని తలుచుకుని ఏడుస్తుంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో మీకు చెప్పలేను..నన్ను క్షమించండి సార్ అనుకుంటుంది...


ఇంటికి చేరుకున్న జగతి మహేంద్ర..రిషి అంటూ అరుచుకుంటూ వస్తారు... రాలేదని చెబుతుంది ధరణి...జగతి-మహేంద్ర టెన్షన్ పడతారు.. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది దేవయాని...