Akira Nandan 1st Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాలో అకీరా నందన్ నటిస్తున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ స్పందించారు.
అకీరా సినిమాల్లోకి వచ్చేది అప్పుడే...
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి రేణు దేశాయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విలేకరుల నుంచి రేణు దేశాయ్‌కి ఈ ప్రశ్న ఎదురైంది. అకీరా నందన్ సినిమాల్లోకి రావడం కోసం అందరి కంటే తానే ఎక్కువగా ఎదురు చూస్తున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు. ఒక తల్లిగా అందరి కంటే ఆ విషయంలో తనకే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. అకీరా నందన్ ఎప్పుడంటే అప్పుడు సినిమాల్లోకి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ అకీరా తన ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలని, అంత వరకు వెయిట్ చేయాలని కోరారు.
Also Read: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
మరోవైపు ‘ఓజీ’ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్... ఆ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసేస్తున్నాయి. ఇప్పటికే తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాలో జపాన్, కొరియన్ నటీనటులు నటించబోతున్నారు అని చెప్పి అంచనాలను ఆకాశానికి పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పని చేస్తున్న సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ క్రేజీ అప్డేట్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.
ప్రముఖ థాయిలాండ్ యాక్టర్ వితాయా పన్‌శ్రిన్‌గార్మ్ (Vithaya Pansringarm) కూడా 'ఓజీ' సినిమాలో నటించబోతున్నారనే విషయాన్ని ఆయన రివీల్ చేశారు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అలాగే మరో ప్రముఖ జపాన్ నటుడు కూడా ‘ఓజీ’లో నటించనున్నట్లు తెలిపారు. మొత్తానికి ‘ఓజీ’ టీమ్ నుంచి వస్తున్న అప్డేట్స్ చూశాక మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఈ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్‌గా కనిపించనుండటం విశేషం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 ద్వితీయార్థంలో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చకచకా షూటింగ్ పూర్తి చేయడానికి సుజీత్ పూర్తి సెటప్‌తో సిద్ధంగా ఉన్నాడు.
Also Read : బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు