ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు ఈ హీరో నటించిన 'ఆచార్య' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ తో కలిసి ఈ సినిమాలో నటించారు చరణ్. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ తో పాటు సమాంతరంగా 'ఆర్ఆర్ఆర్'ను పూర్తి చేశారు రామ్ చరణ్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు ఈ యంగ్ హీరో. 


ఇప్పటికే లెజండరీ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కాకుండా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నారు చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 


అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలొస్తున్నాయి. దానికి కారణమేంటంటే.. గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. సరైన కలెక్షన్స్ రాలేదు. కొంతమంది కావాలనే ఈ సినిమాను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏదైతేనేం.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడని.. గౌతమ్ తో తన సినిమాను హోల్డ్ లో పెట్టే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. 


ఇందులో నిజం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇన్నర్ సర్కిల్స్ ప్రకారం.. గౌతమ్ తో చరణ్ సినిమా కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఎమోషన్స్ తో కూడిన ఓ మాస్ స్టోరీను చరణ్ కోసం రాసుకున్నాడట గౌతమ్. ఇది స్పోర్ట్స్ డ్రామా కాదని రీసెంట్ గా 'ఆచార్య' ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించనున్నారు. 


Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు


Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే