మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుస హిట్ లుగా నిలుస్తున్నాయి. ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టున్నాయి. ఇప్పుడు ‘రావణాసుర’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్బంగా సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రవితేజ పుట్టిన రోజు నాడు ఈ వీడియోను రిలీజ్ చేయడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాంక్షలు చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు మాస్ మహరాజ్ ఫ్యాన్స్. 


ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో విషయానికొస్తే.. ‘రావణాసుర’ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజను చాలా ప్రత్యేకంగా చూపించారు. ఈ మూవీలో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ‘హీరోస్ డోంట్ ఎక్సిస్ట్’ అంటూ విడుదల చేసిన ఆ గ్లింప్స్ వీడియో రవితేజ ఫ్యాన్స్ కు అసలైన బర్త్ డే గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంది. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. 


రవితేజ గతేడాది చివర్లో ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదట్లో మిక్సిడ్ టాక్ వచ్చినా తర్వాత మౌత్ పబ్లిసిటీ తో హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా కథ రొటీన్ గానే ఉన్నా.. మూవీలో రవితేజ నటన, కామెడీ, పాటలు, డైలాగ్స్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రూ.వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రవితేజ కెరీర్ లో రికార్డు స్థాయి వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భీమ్స్ సంగీతం అందించారు. రవితేజ తాజాగా నటిస్తోన్న ‘రావణాసుర’ సినిమాలోనూ భీమ్స్ సంగీత దర్శకుడిగా చేయడం విశేషం. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రావడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 



‘ధమాకా’ సక్సెస్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగానే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు దర్శకుడు బాబీ దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి నటన, రవితేజ క్యారక్టరైజేషన్, యాక్షన్ సన్నివేశాలు, అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వడంతో ‘వాల్తేరు వీరయ్య’ ఈ యేడాది సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఈ సినిమాల తర్వాత రవితేజ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘రావణాసుర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీను అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ‘రావణాసుర’ విడుదల కానుంది. 



Read Also: సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ టీజర్: బతుకమ్మతో వెంకటేష్, విలన్‌గా జగపతిబాబు