అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది రష్మిక. నేషనల్ క్రష్ గా కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ లో రెండు, మూడు సినిమాలు ఒప్పుకుంది రష్మిక. త్వరలోనే ఆమె నటించిన బాలీవుడ్ సినిమాలు విడుదల కానున్నాయి.
ప్రస్తుతం రష్మిక ముంబైలో ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రోలింగ్ కి గురైంది. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. హోటల్ నుంచి బయటకొచ్చిన రష్మికను ఓ చిన్నారి ఆకలిగా ఉందంటూ డబ్బులు అడగడం మొదలుపెట్టింది. అప్పటికే ఆ చిన్నారిని సెక్యూరిటీ గార్డులు పక్కకు తోశారు. అయినా కూడా ఆ పాప రష్మికను ప్రాధేయపడుతూ ఉంది.
కానీ రష్మిక మాత్రం ఆ చిన్నారి చూస్తూ నవ్విందే తప్ప.. ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఈ వీడియో బయటకురావడంతో నెటిజన్లు రష్మికపై విరుచుకుపడుతున్నారు. 'చిన్న పాప నిన్ను అడుక్కుంటుంటే నీకు నవ్వు ఎలా వస్తుందని?' కొందరు.. 'అసలు నీ యాటిట్యూడ్ ఏంటి..? ఈరోజు నుంచి నీ సినిమాలు చూడమని' మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే 'పుష్ప 2' షూటింగ్ లో పాల్గోనుంది. అలానే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు.
Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..
Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి