బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ షో టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు దీని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది. 


బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్ర తాజాగా ఓటీటీ వెర్షన్ ను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇద్దరూ లాంతర్లు పట్టుకొని బిగ్ బాస్ ను వెతకడానికి వెళ్లారు. ముందుగా రవి.. 'బిగ్ బాస్.. బిగ్ బాస్... వియా ఈజ్ వెయిటింగ్ ఫర్ యు.. కమ్ అవుట్' అని పిలుస్తూ ఉంటాడు.


ఇంతలో శ్రీరామచంద్ర.. 'బిగ్ బాస్ బయటకొచ్చిండా..? నీకెలా తెలుసు..?' అని అడుగుతాడు. దానికి రవి 'బిగ్ బాస్ అవుట్ అని ఇంటర్నెట్ లో వస్తుంది కదా.. బిగ్ బాస్ OTT అని.. అంటే బిగ్ బాస్ అవుట్ అని' అంటాడు రవి. 'OTT అంటే అవుట్ కాదు.. టీస్టాల్.. బిగ్ బాస్ చాయ్ తాగుతున్నాడు' అంటాడు శ్రీరామచంద్ర. కొత్త జాతిరత్నాలు అంటూ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు రవి. 






Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..


Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి