సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో నిర్ధారించుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఫేక్ చేయాలనుకునేవాళ్లు ..  అది ఫేక్ కాదు నిజం అని నమ్మించడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తారు. ఇలాంటివి  ప్రతీ రోజూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. నమ్మిన వాళ్లను బకరాను చేస్తూ ఉంటాయి. 


తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ సీబీఎస్ఈ  పన్నెండో తరగతి ఫలితాలను జనవరి 25వ తేదీన విడుదల చేయబోతోందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి సీబీఎస్‌ఈనే విడుదల చేసినట్లుగా చూపిస్తున్న ఓ సర్క్యూలర్‌ను కూడా ప్రచారంలోకి పెట్టారు. ఆ సర్క్యులర్ చూస్తే అచ్చంగా సీబీఎస్‌ఈ విడుదల చేసినట్లుగానే ఉంది. దాన్ని చూస్తే నిజంగానే రిజల్ట్స్ వస్తున్నాయేమోనని అనుకుంటారు. కానీ ఫేక్ అని భారత ప్రభుత్వానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించింది. 


 





Also Read: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?


సీబీఎస్‌ఈకి సంబంధించి గతంలో అనేక ఫేక్ ప్రచారాలు జరిగాయి. సీబీఎస్ఈ విధానంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారందర్నీ  గందరగోళంలో పడేసేందుకు ఫేక్‌ పోస్టులు క్రియేట్ చేసే వారు ప్రయత్నిస్తున్నారు. వారందరికీ ఎప్పటికపపుడు అవగాహన కల్పించి.. పేక్ పోస్టులు ఏవో నిరందరం అప్ డేట్ చేస్తూందో పీఐబీ. 


Also Read:  ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! ఏయే రోజుల్లోనంటే!


కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగకపోవడం.. వివిధ కారణాల వల్ల విద్యార్థులు కూడా ఇలాంటి వాటి పట్ల ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తిని కనిపెట్టి.. తప్పుడు సమాచారాన్ని పంపుతున్నారు కొంత మంది వ్యక్తులు. దీనిపై విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 



Also Read: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్