అచ్చ తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్, తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ పాత్రలో రష్మిక కంటే తాను ఇంకా బాగా నటించేదానినని ఐశ్వర్య అన్నట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఐశ్వర్య తాజాగా వివరణ ఇచ్చింది.  


నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు- ఐశ్వర్య


‘‘సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాటి నుంచి నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి, నా సినిమాల విజయానికి కృషి చేస్తున్న సినీ లవర్స్ అందరికీ ధన్యవాదాలు. నన్ను, నా నటనను ఇష్టపడుతున్న అభిమానులకు పేరు పేరుగా కృతజ్ఞతలు. తాజా ఇంటర్వ్యూలో  “మీరు ఎలాంటి పాత్రలు పోషించడానికి ఇష్టపడతారు?” అని ఓ ఇంటర్వ్యూలో నన్ను  అడిగారు. టాలీవుడ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని, మంచి పాత్రలు చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాను. ఎగ్జాంపుల్ గా ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర నాకు బాగా నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు బాగా సూటవుతాయన్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే? కొంత మంది నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక నటనను కించపరిచేలా మాట్లాడినట్లు వార్తలు రాశారు. అందా అవాస్తవం. ఆ సినిమాలో రష్మిక నటన చాలా బాగుంది. అంతేకాదు, నా తోటి నటీనటుల మీద ఎంతో గౌరవం ఉంది.  ఇప్పటికై నా వ్యాఖ్యలను తప్పుగా ప్రసారం చేయడం మానుకోవాలి” అంటూ ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది.






మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు- రష్మిక


తాజాగా ఐశ్వర్య రాజేష్ వివరణపై రష్మిక మందన్న స్పందించింది. వివరణ ఇచ్చుకోవాల్సిన అవరం లేదని చెప్పింది. “హాయ్ లవ్. ఇప్పుడే నేను మీ వివరణ చూశాను. మీరు వ్యాఖ్యల వెనుక అర్థం నాగా బాగా అర్థం అయ్యింది. ఇందులో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీ వ్యాఖ్యల వెనుక ఎటువంటి చెడు కారణాలు లేవని నేను భావిస్తున్నాను. మీ పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. మీ ‘పర్హానా’ చిత్రానికి ఆల్ ది బెస్ట్” అని రాసుకొచ్చింది.  






తమిళ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మిస్ మ్యాచ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' 'టక్ జగదీశ్' లో 'రిపబ్లిక్' 'డ్రైవర్ జమున' వంటి సినిమాలలో నటించింది. ఈ ఏడాదిలో 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' 'రన్ బేబీ రన్' 'సొప్పన సుందరి' చిత్రాలతో అలరించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫర్హానా' మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ ప్రభు నిర్మించారు.


Read Also: జల ప్రళయంలో వెల్లివిరిసిన మానవత్వం, ఆకట్టుకుంటున్న ‘2018’ తెలుగు ట్రైలర్